Home /News /business /

BIKE NEWS ARTICLE TVS ZEPPELIN ROYAL ENFIELD 650 CRUISER AND MORE UPCOMING BIKES IN INDIA IN MK GH

New Bikes: కొత్త సంవత్సరం కొత్త బైక్ కొంటున్నారా...అయితే New Models ట్రై చేయండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన బిఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త బైక్స్ ను మార్కెట్లోకి అందుబాటులో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే బైక్లలో తక్కువ ధరకు లభించే బైక్స్ నుండి ప్రీమియం రేంజ్ బైక్ల వరకు ఉండనున్నాయి. కాగా, 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని బైక్లను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  మోటారు సైకిళ్ల విభాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారత్. అయితే, ఈ ఏడాది కరోనా సంక్షోభంతో అమ్మకాలు మందగించాయి. కానీ, కరోనాతో ప్రజలు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యతనిస్తుండటంతో గత కొద్ది రోజుల నుంచి బైక్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే దోరణిని వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని అన్ని బైక్‌ల తయారీ కంపెనీలు చూస్తున్నాయి. అంతేకాక, భారత ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన బిఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త బైక్స్ ను మార్కెట్లోకి అందుబాటులో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే బైక్లలో తక్కువ ధరకు లభించే బైక్స్ నుండి ప్రీమియం రేంజ్ బైక్ల వరకు ఉండనున్నాయి. కాగా, 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని బైక్లను పరిశీలిద్దాం.

  1. TVS Zeppelin R

  ఇటీవల భారత మార్కెట్లోకి విడుదలైన హోండా హెచ్ నెస్ సిబి 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియర్ బైక్లకు గట్టి పోటీనిచ్చేందుకు టీవీఎస్ కంపెనీ Zeppelin Rను వచ్చే ఏడాది విడుదల చేయనుంది. టీవీఎస్(TVS ) బ్రాండ్ నుండి క్రూయిజర్ వేరియంట్లో వస్తున్న మొదటి బైక్గా దీన్ని చెప్పవచ్చు. దీన్ని 2‌021 మొదటి త్రైమార్షికంలోనే విడుదల చేయనున్నట్లు టీవీఎస్ పేర్కొంది. దీనిలో కూడా అపాచీ ఆర్టిఆర్ 310లో ఉండే ఇంజిన్‌నే ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  2. Hero AE-47

  ఎలక్ట్రికల్ బైక్ విభాగంలో హీరో(Hero) కంపెనీ విడుదల చేస్తున్న ప్రీమియం బైక్గా హీరో AE-47ని పేర్కొనవచ్చు. దీనిలో బ్లాక్ ఫ్లైస్క్రీన్, వైడ్ హ్యాండిల్‌బార్‌లతో రౌండ్ హెడ్‌ల్యాంప్ వంటి వాటిని అందించనున్నారు. ఈ బైక్ పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్ కలిగి ఉంటుంది. ఇది స్పీడ్, ట్రిప్ మీటర్, బ్యాటరీ రేంజ్, ఛార్జ్ స్టేటస్ వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైడర్కు అందిస్తుంది. దీనిలోని 4 kW మోటార్ 3.5 kWh పవర్ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.

  3. Royal Enfield 650 cruiser

  రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల తన పోర్ట్‌ఫోలియోకు కొత్త క్రూయిజర్ మెటియర్ 350ను జోడించింది. ఈ కొత్త RE క్రూయిజర్ ఆటో ఎక్స్‌పో–2018లో ప్రదర్శించిన KX కాన్సెప్ట్‌ను గుర్తుచేస్తుంది. 2021లో విడుదల కాబోయే ఈ బైక్ ఇన్వర్టెడ్ ఫోర్క్‌, ట్విన్-పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లను కలిగి ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది.

  4. Husqvarna 401 twins

  స్వీడిష్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల హుస్క్వర్నా 250 ట్విన్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఇదే విభాగంలో హుస్క్వర్నా విట్పిలెన్ 401, స్వార్ట్‌పిలెన్ 401లను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. హుస్క్వర్నా విట్పిలెన్ 401 కేఫ్ రేసర్ బైక్గా, స్వార్ట్‌పిలెన్ 401 మిడ్ ఆఫ్ రోడర్గా చెప్పవచ్చు. ఈ రెండు వేరియంట్లు డ్యూక్‌ వేరియంట్తో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉంటాయి.

  5. Triumph Trident 660

  బ్రిటన్కు చెందిన బైక్ తయారీ కంపెనీ ట్రయంఫ్ ట్రైడెంట్ 660(Triumph Trident 660) రోడ్‌స్టెర్ బైక్ను 2021లో విడుదల చేయనుంది. కాగా, ప్రస్తుతం ఈ బైక్ రూ. 50,000 ముందస్తు చెల్లింపుతో బుకింగ్‌కు అందుబాటులో ఉంది. దీనిలో 660 సిసి ట్రిపుల్- సిలిండర్ ఇంజన్, 10,250 rpm వద్ద, 10 bhp , 6.250 rpm వద్ద 64 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బైక్, ప్రామాణికంగా, రెండు రైడింగ్ మోడ్‌లు, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(traction control system), రైడ్-బై-వైర్ థొరెటల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

  6. BS6 KTM 790 Duke

  KTM 790 డ్యూక్ గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించబడింది. అయితే, BS 6 ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ బైక్ తొలుత ఏప్రిల్లో మార్కెట్లోకి రావాల్సి ఉండగా, COVID-19 వ్యాప్తితో వాయిదా పడింది. ఇది బిఎస్ 6 -కంప్లైంట్ లిక్విడ్-కూల్డ్ 799 సిసి ఇంజన్ ద్వారా పనిచేయనుంది. అంతేకాక, ఇది 103 bhp వద్ద, 87 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  7. Ducati Monster

  ఈ బైక్ మునుపటి కంటే చాలా అడ్వాన్సుడ్ ఫీచర్లతో ముందుకురానుంది. పానిగలే V4 నుండి తీసుకోబడిన మోనోకోక్ అల్యూమినియం ఫ్రేమ్‌(monocoque aluminium frame )తో ఇది తయారు చేయబడింది. ఈ బైక్‌ మునుపటి కంటే చాలా తేలికగా ఉండనుంది. దీనిలోని ఇంజన్ 9,250 ఆర్పిఎం వద్ద 110 బిహెచ్‌పి టార్క్ ను, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 93 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Automobiles, Bike, CAR, Cars

  తదుపరి వార్తలు