BIGG BOSS 5 TELUGU CONTESTANT WHO IS LOBO DETAILS MK
Bigg Boss 5 Telugu: లోబో ఆస్తుల విలువ తెలిస్తే షాక్ తినక తప్పదు..అతడి కారు ధరెంతో తెలుసా..?
ప్రతీకాత్మకచిత్రం
లోబో గురించి అతడి సోదరుడు చాలా పెద్ద రహస్యాలే బయటపెడుతున్నాడు. లోబో ఆస్తుల చిట్టా బయటపెడుతున్నాడు. లోబో దగ్గర ఖరీదైన BMW కారు ఉందని, అలాగే అతడికి నగరంలో చాలా ఆస్తులు ఉన్నాయని అతడి సోదరుడు చెబుతున్నాడు.
బిగ్ బాస్ 5 తెలుగులో చిత్రవిచిత్రంగా కనిపించే లోబో పక్కా హైదరాబాదీ బాషలో యాంకరింగ్ చేసి పుల్ పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి వచ్చాక లోబో గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు.. లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. స్కూల్ టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీనితో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి అతనికి లోబో అనే పేరు పెట్టేసింది. దీనితో అప్పటినుంచి మహమ్మద్ ఖయ్యూం కాస్త లోబోగా మారిపోయాడు. అయితే లోబో గురించి అతడి సోదరుడు చాలా పెద్ద రహస్యాలే బయటపెడుతున్నాడు. లోబో ఆస్తుల చిట్టా బయటపెడుతున్నాడు. లోబో దగ్గర ఖరీదైన BMW కారు ఉందని, అలాగే అతడికి నగరంలో చాలా ఆస్తులు ఉన్నాయని అతడి సోదరుడు చెబుతున్నాడు. అంతేకాదు లోబో బ్రదర్ ఇర్ఫాన్ వరుసగా పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తి కర విషయాలు పంచుకున్నాడు. అందులో ప్రధానంగా ఇర్ఫాన్ తన సోదరుడు లోబో గురించి చెబుతూ తనకు లోబో తోబుట్టువు కాదని, కానీ అతని దగ్గర పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత ఇద్దరి మధ్యన నమ్మకం కుదిరిందని, కోటి రూపాయలు అయినా సరే తనపై నమ్మకంతో లోబో తన చేతిలో పెడతాడని ఇర్ఫాన్ చెప్పాడు. అంతేకాదు లోబోకు సిటీలో మంచి ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్స్ ఉన్నాయని, అతడు వాడే కారు కూడా BMW అని చెప్పాడు. అలాగే బిగ్ బాస్ కు వెళుతూ, తనకు పూరత్ బాధ్యతలను లోబో అప్పగించాడని, ఇర్ఫాన్ చెప్పాడు. బిగ్ బాస్ అనంతరం లోబోకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చాడు.
ఇక లోబోది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, అతడు ముక్కుసూటిగా ఉంటాడని, బిగ్ బాస్ ఫైనలిస్టు వరకూ లోబో వెళ్లే చాన్స్ ఉందని, అతడు లేకపోతే బిగ్ బాస్ చాలా బోరింగ్ అవుతుందని, ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఇక లోబోకు త్వరగా కోపం వస్తుందని, అతడు కాస్త షార్ట్ టెంపర్ అని చెప్పాడు. కానీ కోపం తగ్గిన తర్వాత అతడు ఐసులా కరిగిపోతాడని చెప్పాడు. మొత్తానికి లోబో ఆస్తుల చిట్టా బయట పడింది. మనోడు బయటకు కనిపించేంత మామూలు వ్యక్తి కాదని తేలిపోయింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.