Home /News /business /

BIG SHOCK TO INDIAN WAREN BUFFET RAKESH JHUNJHUNWALA LOSE 900 CRORE RUPEES IN ONE DAY AK GH

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌జున్‌వాలాకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ.842 కోట్లు నష్టం.. అది కూడా రెండు స్టాక్స్ మీదే..

రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా (ఫైల్ ఫోటో )

రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా (ఫైల్ ఫోటో )

దేశీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు భారీ షాక్ తగిలింది. తనకు ఇష్టమైన రెండు స్టాక్స్.. టైటాన్, స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌పై శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ?

ఇంకా చదవండి ...
దేశీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు(Rakesh Jhunjhunwala) భారీ షాక్ తగిలింది. తనకు ఇష్టమైన రెండు స్టాక్స్.. టైటాన్,(Titan) స్టార్ హెల్త్ &(Star Health) అలైడ్ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌పై శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు రూ. 842 కోట్లను ఆయన కోల్పోయారు. టైటాన్ కంపెనీ షేరు ధర ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి తక్కువగా ప్రారంభమై రూ. 1997కి చేరింది. NSEలో నిన్నటి ముగింపు ధర రూ. 2060.95 స్థాయిల నుంచి ఒక్కో షేరుకు రూ.63.95 తగ్గింది. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 28.32 శాతం క్షీణించగా, బెంచ్‌మార్క్(Benchmark) సెన్సెక్స్ 11.26 శాతం నష్టపోయింది.

టెక్నికల్‌గా చూస్తే, ఈ స్టాక్ డైలీ RSI (రిలేటివ్ స్ట్రెన్త్ ఇండెక్స్) 26.756 వద్ద ఉంది. RSI సున్నా నుంచి 100 మధ్య ఊగిసలాడుతుంది. RSI 70 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్‌బాట్‌గా పరిగణిస్తారు. ఇది 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఓవర్‌సోల్డ్‌గా పరిగణిస్తారు. డైలీ చార్ట్‌లో ఈ స్టాక్ 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ (SMA) కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది.

2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటి టైటాన్ కంపెనీ షేర్‌హోల్డింగ్ విధానం ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలాకు 3,53,10,395 కంపెనీ షేర్లు ఉండగా, ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలాకు 95,40,575 టైటాన్ షేర్లు ఉన్నాయి. అంటే ఝున్‌జున్‌వాలా దంపతులకు 4,48,50,970 టైటాన్ షేర్‌లు ఉన్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర 63.95 పడిపోయింది. ఈ లెక్కన చూసుకుంటే.. రాకేష్ జున్‌జున్‌వాలా నెల్ వర్త్ దాదాపు రూ. 287 కోట్లు (రూ. 63.95 x 4,48,50,970) వరకు పడిపోయింది.

స్టార్ హెల్త్ షేరు ధర ఈరోజు తక్కువగా ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయానికి ఒక్కో షేరు ధర రూ.609.05కి చేరుకుంది. గురువారం స్టాక్ రూ.664.15 వద్ద ముగియడంతో, ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే రూ.55.10 తగ్గింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లు 2022లో ఇప్పటివరకు 17 శాతం కంటే ఎక్కువకు పడిపోయాయి. రాకేష్ జున్‌జున్‌వాలాకు 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లు ఉన్నాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ గంట తర్వాత 15 నిమిషాల్లో ఒక్కో షేరుకు రూ. 55.10 తగ్గింది. కాబట్టి ఈ పోర్ట్‌ఫోలియో స్టాక్‌లో తగ్గుదల కారణంగా రాకేశ్ జున్‌జున్‌వాలా నెట్ వర్త్ దాదాపు రూ. 555 కోట్లు (రూ. 55.10 x 10,07,53,935) తగ్గింది. దీంతో ఒక్కరోజే రెండు స్టాక్స్‌పై ఆయన రూ.842 కోట్లు నష్టపోయారు.

ఐసీఐసీఐ డైరెక్ట్ రీసెర్చ్‌ విశ్లేషకులు కూడా కౌంటర్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ ఉంటుందన్నారు. స్టాక్‌పై కొనుగోలు రేటింగ్‌ను రూ. 825 టార్గెట్ ధరతో కొనసాగించారు, కౌంటర్‌లో 20 శాతం పైకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషించారు. స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలతో రిటైల్ హెల్త్ విభాగంలో స్టార్ హెల్త్ తన నాయకత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు వారు తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Rakesh Jhunjhunwala, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు