Home /News /business /

BIG RELIEF FOR FUTURE GROUP IN DEAL WITH RELIANCE INDUSTRIES LIMITED SUPREME COURT HALTS DELHI HIGH COURT ORDER SS

Future Group: అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ వివాదం... సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

Future Group: అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ వివాదం... సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే
(file photo: Supreme Court)

Future Group: అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ వివాదం... సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే (file photo: Supreme Court)

Future Group | ఫ్యూచర్ గ్రూప్-అమెజాన్ వివాదం (Amazon Future Group) సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట కల్పించింది.

    అమెజాన్‌తో వివాదంలో ఫ్యూచర్ గ్రూప్‌కు సుప్రీం కోర్టు ఊరట కలిగించింది. అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ వివాదంపై కొద్ది రోజుల క్రితం ఫ్యూచర్ గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఒప్పందం (Future Group Reliance deal) కుదుర్చుకున్నామని, ఆ ఒప్పందం అమలు చేయకపోతే తమ సంస్థకు నష్టం వస్తుందని ఫ్యూచర్ గ్రూప్ వాదించింది. దీంతో తాజాగా సుప్రీం కోర్టు ఫ్యూచర్ గ్రూప్‌కు (Future Group) అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఫ్యూచర్, రిలయన్స్ డీల్‌కు సంబంధించి నాలుగు వారాల వరకు ఎలాంటి తుది ఆదేశాలు జారీ చేయకూడదని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యూనల్ (NCLAT), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సంస్థల్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఏఎస్ బొపన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

    IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి

    అంతకు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఫ్యూచర్ గ్రూప్ మధ్య డీల్ కుదిరింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ అమెజాన్ సంస్థ సింగపూర్‌లోని మధ్యవర్తిత్వ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌లో తమకు వాటాలు ఉన్నాయని, కాబట్టి ఫ్యూచర్ రీటైల్‌లో తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని అమెజాన్ వాదించింది. దీనిపై విచారణ జరిపిన సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఈ ఒప్పందంపై కోర్టు స్టే విధించింది. అయితే విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు ఇండియాలో చెల్లవంటూ ఫ్యూచర్ గ్రూప్ వాదించింది. దీంతో సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు అమలు చేయాలంటూ అమెజాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి

    మరోవైపు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల ఆస్తుల్ని అటాచ్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రమోటర్ అయిన కిషోర్ బయానీతో పాటు ఫ్యూచర్ గ్రూప్ డైరెక్టర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంత ఫ్యూచర్ గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Amazon, AMAZON INDIA, Reliance, RIL

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు