మీ దగ్గర రూ.5 కరెన్సీ నోట్లు (Rs. 5 currency note) ఉన్నాయా? వాటితో లక్షల రూపాయాల ఆదాయం పొందవచ్చు. అదెలాగంటే.. భారతదేశంతో సహా అనేక ప్రాంతాల్లో కరెన్సీని ఇష్టంగా సేకరించేవారు ఎందరో ఉన్నారు. నిర్దిష్ట కరెన్సీ నంబర్, డేట్, నిర్దిష్ట అంకెలు గల కరెన్సీ నోట్ల కోసం వీరు అన్వేషిస్తున్నారు. బాగా అరుదైన లేదా లక్కీగా భావించే కరెన్సీ నోట్‌కు వీరు ఎక్కువగా డబ్బులు చెల్లించి సొంతం చేసుకుంటుంటారు. ఒక ప్రత్యేకమైన నంబర్ ఉన్న రూ.5 కరెన్సీ నోట్‌ను రూ.2 లక్షలు పెట్టి కొనుగోలు చేసేందుకు వీరు సిద్ధమయ్యారు. ఆ నంబర్ ఏంటో చూద్దాం.
నోట్ ఎలా ఉండాలి?
రూ.2 లక్షలు పొందాలంటే మీ వద్ద ఉన్న రూ.5 కరెన్సీ నోటుపై "786" అనే నంబర్ తప్పకుండా ఉండాలి. నోటుపై 786 అని ఎక్కడ కనిపించినా మీరు రూ.2 లక్షలు పొందేందుకు అర్హత సాధిస్తారు. దీంతోపాటు రైతు ట్రాక్టర్ నడుపుతున్న బొమ్మ కూడా నోటుపై ఉండాలి. ఈ నంబర్‌ను చాలామంది అదృష్ట లేదా పవిత్రమైన సంఖ్యగా భావిస్తుంటారు. అందుకే ఇలాంటి నోట్లకు అంత డిమాండ్ ఏర్పడింది.
బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!
ఎక్కడ అమ్మాలి?
అరుదైన నాణేలు, పాత నోట్లకు ఆన్లైన్ ఆక్షన్ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ప్రజలు ఆన్లైన్లో వీటిని ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ.లక్షలు సంపాదించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు షాప్‌క్లూస్ (ShopClues), మరుధర్ ఆర్ట్స్ (Marudhar Arts) వంటి కంపెనీలు పైన చెప్పినట్లు ఉన్న రూ.5 కరెన్సీ నోట్లతో రూ.2 లక్షలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ డబ్బులు సంపాదించేందుకు మీరు ఈ కంపెనీల వెబ్సైట్ విజిట్ చేయాలి. మీ నోటును విక్రయించడానికి సెల్లర్ (Seller)గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నోటుకు రెండు వైపులా ఉన్న ఫొటోను అప్లోడ్ చేయాలి. ధరను కూడా డిసైడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ నోటును కొనడానికి ఇష్టపడే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇక coinbazzar.comలో పాత నోట్లకు బదులుగా మీరు రూ.వేలల్లో, రూ.లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. ఈ తరహా వెబ్సైట్లలో మీరు అరుదైన లేదా పాత నోట్స్ విక్రయించవచ్చు లేదా కొనొచ్చు.
* ఆర్బీఐ అరుదైన నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని కరెన్సీ నోట్లను చాలా అరుదుగా జారీ చేస్తూ ఉంటుంది. అలాంటి అత్యంత అరుదైన నోట్లలో పైన చెప్పిన ఐదు రూపాయల నోటు కూడా ఒకటి. అందుకే దీనికి చాలా డిమాండ్, వ్యాల్యూ ఉంది. ఎంతగా అంటే ఈ ఒక్క నోటుకు బదులుగా లక్షలు పొందొచ్చు. ఇక పాత కరెన్సీ నోట్లు, కరెన్సీ కాయిన్స్ సేకరించే వారు కూడా అప్పుడప్పుడు నక్క తోక తొక్కుతుంటారు. ఎందుకంటే బాగా పాతవైన కరెన్సీకి కూడా మార్కెట్లో మంచి వ్యాల్యూ పలుకుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS