ఎల్ఐసీలో ప్రీమియం డిపాజిట్ రూల్ మారింది తెలుసా?

ఇటీవల ఎల్ఐసీ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎల్ఐసీ పాలసీల పేరుతో మోసగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. పత్తాలేకుండా పోతున్నారు. దీంతో ఎల్ఐసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే పాలసీలు ఉన్నవారితో పాటు... కొత్తగా పాలసీలు తీసుకోవాలనుకునేవారినీ అప్రమత్తం చేస్తోంది.

news18-telugu
Updated: October 29, 2018, 5:57 PM IST
ఎల్ఐసీలో ప్రీమియం డిపాజిట్ రూల్ మారింది తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఎల్ఐసీ... భారతదేశంలో కోట్లాదిమంది పాలసీదారులున్న అతిపెద్ద సంస్థ. ఇటీవల మోసాలు పెరిగిపోతుండటంతో ఎల్ఐసీ యాజమాన్యం ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తోంది. పాలసీదారుల్ని అప్రమత్తం చేస్తోంది. మరి మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. పాలసీ ప్రీమియం డిపాజిట్ చేసే నిబంధన మారింది.ఇటీవల ఎల్ఐసీ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎల్ఐసీ పాలసీల పేరుతో మోసగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. పత్తాలేకుండా పోతున్నారు. దీంతో ఎల్ఐసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే పాలసీలు ఉన్నవారితో పాటు... కొత్తగా పాలసీలు తీసుకోవాలనుకునేవారినీ అప్రమత్తం చేస్తోంది. మీరు పాలసీదారుడైనా, త్వరలో పాలసీ తీసుకోవాలనుకున్నా... ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి.

1. మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించేందుకు ఇచ్చే చెక్కుపై ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా వేరే పేరు మీద చెక్కు ఇవ్వాలని అడిగితే నిరాకరించండి. ఆ విషయాన్ని ఎల్ఐసీకి తెలపండి.2. చెక్కు లేదా డీడీ తప్పనిసరిగా ఎల్ఐసీ ఆఫ్ ఇండియా పేరు మీదే ఉండాలి. దానిపైన పాలసీ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కువ పాలసీలకు ఒకే చెక్కు ఇవ్వాలనుకుంటే... చెక్కు ముందు వైపు ఓ పాలసీ నెంబర్, చెక్కు వెనుకవైపు మిగతా పాలసీ నెంబర్లు రాయాలి.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి...

మీ బడ్జెట్‌లో ఈ 5 మార్పులు కనిపించాయా? అప్పులపాలవుతున్నట్టే...

ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?

ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్: తగ్గిన ఏటీఎం విత్‌డ్రా లిమిట్

ఫ్రీ యాప్స్ వాడుతున్నారా? మీ డేటా గల్లంతే...

Video: అప్పుల ఊబిలోకి ప్రయాణం... ఇవే 5 హెచ్చరికలు

Photos: ఖరీదైన కార్లు, ఫ్లాట్లు... మనసున్న మహారాజు దీపావళి గిఫ్ట్‌లు

Photos: ఇస్తాంబుల్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్ విశేషాలు తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: October 29, 2018, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading