Home /News /business /

BIG DECISION 50 PC OF OLA UBER VEHICLES WILL BE ELECTRIC IN THIS STATE BY MARCH 2023 MK

Electric Vehicles: 2023 నాటికి ఢిల్లీలో Ola-Uber వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ గా మార్చాలని ఆదేశం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

దేశ రాజధానిలో కాలుష్యం ప్రాణాంతక స్థాయిలోనే ఉంది , దానిని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని క్యాబ్ అగ్రిగేటర్‌లను అంటే ఓలా, ఉబర్ వంటి కంపెనీలను మార్చి 2023 నాటికి ఈ కంపెనీలు తమ కొత్త ద్విచక్ర వాహనాలన్నింటిలో 50 శాతం , కొత్త నాలుగు చక్రాల వాహనాల్లో 25 శాతం ఎలక్ట్రిక్‌గా మార్చాలని ఆదేశించింది.

ఇంకా చదవండి ...
    దేశ రాజధానిలో కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరుకుంది. అయితే ఈ కాలుష్య కాసారాన్ని  నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు, ఇఫ్పటికే కార్లను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. సరి, బేసి సంఖ్య వాహనాలను ప్రవేశ పెట్టినా ఫలితం లేేకుుండా పోయింది. దీంతో  ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని క్యాబ్ అగ్రిగేటర్‌లను అంటే ఓలా, ఉబర్ వంటి కంపెనీలను మార్చి 2023 నాటికి ఈ కంపెనీలు తమ కొత్త ద్విచక్ర వాహనాలన్నింటిలో 50 శాతం, కొత్త నాలుగు చక్రాల వాహనాల్లో 25 శాతం ఎలక్ట్రిక్‌గా మార్చాలని ఆదేశించింది. ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. ఈ చొరవ ద్వారా క్యాబ్ అగ్రిగేటర్లు పర్యావరణ అనుకూలమైనవిగా మారేందుకు ప్రోత్సాహం లభిస్తోంది.

    త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది

    60 రోజుల వ్యవధి తర్వాత, అభ్యంతరాలను అంచనా వేసిన తర్వాత, ఆర్డర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి గెహ్లాట్ చెప్పారు. త్వరలో దాని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఢిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. దీనికి ముందు, ప్రజల స్పందనలు 60 రోజుల పాటు తీసుకుంటారు. వాటిని అంచనా వేసిన తర్వాత, అవసరాన్ని బట్టి మార్పులతో దాని నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ అగ్రిగేటర్ల విధానం అమలులోకి వచ్చిన తర్వాత, క్యాబ్ , డెలివరీ సేవలను అందించే 50 శాతం వాహనాలు మార్చి 2023 నాటికి ఎలక్ట్రిక్‌గా మారుతాయి.

    నవంబర్ 2021 త్రైమాసికంలో 9,540 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి

    అంతకుముందు కైలాష్ గెహ్లాట్ వాణిజ్య వాహనాల యజమానులతో 2023 నాటికి తమ సగం వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడం గురించి చర్చించారు. ఇది కాకుండా స్విచ్ ఢిల్లీ ప్రచారంలో 2025 నాటికి సాధారణ వాహనాల నుండి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని కూడా గెహ్లాట్ వాణిజ్య వాహన యజమానులను కోరారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు 1,30,544 ఎలక్ట్రిక్ వాహనాలను నమోదు చేసింది. ఇది భారతదేశంలో రెండవ అత్యధికం  కావడం విశేషం. సెప్టెంబర్ నుండి నవంబర్ 2021 వరకు త్రైమాసికంలో ఢిల్లీ 9,540 వాహనాలను విక్రయించింది. ఇందులో కూడా సెప్టెంబర్‌లో 2,873 యూనిట్లు, అక్టోబర్‌లో 3,275 యూనిట్లు, నవంబర్‌లో 3,392 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Ola, Uber

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు