హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tesla: భారత్‌లో టెస్లా కంపెనీకి ఎదురు దెబ్బ.. దిగుమతి సుంకం తగ్గింపు కుదరదన్న ప్రభుత్వం

Tesla: భారత్‌లో టెస్లా కంపెనీకి ఎదురు దెబ్బ.. దిగుమతి సుంకం తగ్గింపు కుదరదన్న ప్రభుత్వం

ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు

టెస్లా కార్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ భారత ప్రభుత్వానికి ఆ సంస్థ చేసిన వినతిని ప్రభుత్వం నిరాకరించడమే దీనికి కారణం. ప్రస్తుతానికి ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లో అమ్మాలన్న టెస్లా సంస్థ ప్లాన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా వస్తున్న టెస్లా కార్ల ధర ఇప్పటికే చాలా అధికంగా ఉంది. ఈ కార్ల విలువపై 60 నుంచి 100 శాతం దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. దీంతో వీటి ధర మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది భారత్‌లోని ఎంతో మంది కస్టమర్లు కొనగలిగే ఖరీదు కంటే చాలా ఎక్కువ. ఒకవేళ టెస్లా.. భారత్‌లో తయారీ యూనిట్ ప్రారంభిస్తే.. దిగుమతి సుంకాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలొచ్చాయి.

కానీ పార్లమెంట్‌లో మంత్రి క్రిష్ణన్ పాల్ గుజ్జర్ మాట్లాడుతూ భారీ పరిశ్రమల శాఖ దగ్గర ఇలాంటి ఏ ప్రపోజల్ ప్రస్తుతం పెండింగ్‌లో లేదని వెల్లడించారు. అంతేకాదు.. విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు వాటిపై ట్యాక్సులు తగ్గించడం, ఛార్జింగ్ స్టేషన్లు పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లోనే తయారుచేసేలా ఎన్నో పద్ధతులను ప్రవేశపెట్టింది. అయితే టెస్లా కోసం ప్రత్యేకంగా ఈ సుంకాలను తగ్గించే దిశగా మాత్రం ప్రభుత్వం ఆలోచనలు చేయట్లేదు. ఈ సంస్థ మొదట భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం యూనిట్లను తయారుచేయనుంది. ఆ తర్వాత దిగుమతి చేసిన కార్లు అమ్మకాలు బాగా సాగితే కొత్త యూనిట్లను పెడతామని కూడా ఎలాన్ మస్క్ వెల్లడించారు. అయినా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించకపోవడం గమనార్హం.

గత నెలలో టెస్లా తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతూ ట్రాన్స్ పోర్ట్, ఇండస్ట్రీ మినిస్ట్రీకి లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న 60 నుంచి 100 శాతానికి బదులుగా తమ వాహనాలపై వేసే సుంకాన్ని కనీసం 40 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రస్తుతం ఈ రేటు నలభై వేల డాలర్ల కంటే తక్కువైన వాహనాలకు 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలకు 100 శాతంగా ఉంది. టెస్లా ముందుగా తమ వాహనాలను 2021 లోనే అమ్మకానికి పెట్టాలని భావించినా ఈ దిగుమతి సుంకం వల్ల అది ఆలస్యమైంది. భారత మార్కెట్లో తమ వాహనాలను అమ్మేందుకు ఈ సంస్థ ఎంతగానో వేచి చూస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటికే ఉన్న తక్కువ డిమాండ్ తో పాటు ఈ అధిక ధర ఆ సంస్థకు పెద్ద శరాఘాతంగా మారింది.

First published:

Tags: Cars, Tesla Motors

ఉత్తమ కథలు