Home /News /business /

BIG ALERT TO PENSIONERS NATIONAL PENSION SCHEME TO LET SUBSCRIBERS CHANGE ASSET ALLOCATION FOUR TIMES A YEAR UMG GH

NPS Options: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. సంవత్సరంలో నాలుగు సార్లే ఆ ఆప్షన్..!

నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొత్త ప్రణాళికలు.

నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొత్త ప్రణాళికలు.

పెన్షన్ (Pension) సెక్టార్ రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)ను మరింత ఫీచర్-రిచ్ రిటైర్మెంట్ సొల్యూషన్‌గా మార్చడానికి సిద్ధమైంది. ఇందుకు కొత్త ప్రణాళికలను ఆవిష్కరించింది.

ఇంకా చదవండి ...
పెన్షన్ సెక్టార్ రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)ను మరింత ఫీచర్-రిచ్ రిటైర్మెంట్ సొల్యూషన్‌గా మార్చడానికి సిద్ధమైంది. ఇందుకు కొత్త ప్రణాళికలను ఆవిష్కరించింది. అధిక ఈక్విటీ కేటాయింపులను అనుమతించడం, ఫండ్ మేనేజర్‌లకు మరిన్ని ఆప్షన్‌లు, ఒక సంవత్సరంలో ఆస్తుల కేటాయింపులో మరిన్ని మార్పులను చేసుకునే వీలు కల్పించడం వంటి వివిధ మార్పులను రెగ్యులేటర్ తీసుకువచ్చింది.

ప్రత్యామ్మాయ పెట్టుబడులకు అనుమతి
పెన్షన్ సెక్టార్ ద్వారా నిర్వహిస్తున్న రూ.35 ట్రిలియన్ల విలువైన ఆస్తులలో, ఎన్‌పీఎస్‌ ఆస్తులు 21 శాతం, అంటే మొత్తం రూ.7.3 ట్రిలియన్లు. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్‌లు అనే మూడు అసెట్ క్లాస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంచుకునే సదుపాయం NPS చందాదారులకు ఉంది. NPS ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడులను కూడా అనుమతిస్తుంది. ఇప్పటివరకు ఈ అసెట్ కేటాయింపును సబ్‌స్క్రైబర్‌లు యాక్టివ్ చాయిస్ అసెట్ అలోకేషన్‌ని ఎంచుకుంటే సంవత్సరానికి రెండుసార్లు మార్చుకోవచ్చు. త్వరలో సబ్‌స్క్రైబర్‌లు ప్రతి టైర్ I, టైర్ II ఖాతాల కోసం - సంవత్సరానికి నాలుగు సార్లు ఈ అసెట్ కేటాయింపును మార్చుకునే అవకాశం ఉంది.



PFRDA చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ‘ఆస్తి కేటాయింపును మార్చడానికి మరిన్ని ఆప్షన్స్‌ ఉంటే అవగాహన ఉన్న చందాదారులు మార్కెట్ కదలికల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక సంవత్సరంలో మరిన్ని మార్పులను అనుమతించమని చందాదారుల నుండి అభ్యర్థనలు ఉన్నాయి. మేము ఒక సంవత్సరంలో నాలుగు మార్పులను అనుమతిస్తున్నాం. అయితే ఇవి దీర్ఘకాలంగా ఉండే నిర్ణయాలు కాబట్టి చందాదారులు వివేకంతో ఉపయోగించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: సైబర్‌ బుల్లీయింగ్.. అసలు ఏంటి ఇదీ..? డేటా చోరీ కాకూడదంటే.. కచ్చితంగా ఇది చదవాల్సిందే!


అందుబాటులో 10 మంది ఫండ్‌ మేనేజర్‌లు
ప్రస్తుతానికి చందాదారులు తమ పెట్టుబడుల కోసం అందుబాటులో ఉన్న ఏడుగురు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ల నుంచి ఒక పెన్షన్ ఫండ్ మేనేజర్‌ని ఎంచుకోవాలి. మూడు కొత్త పెన్షన్ ఫండ్ మేనేజర్లు యాక్సిస్, మ్యాక్స్ లైఫ్, టాటా పెన్షన్ ఫండ్ మేనేజర్ కోసం సూత్రప్రాయంగా ఆమోదం పొందారు. వ్యాపార ప్రారంభానికి సంబంధించిన తుది ధ్రువీకరణ పొందిన తర్వాత ఈ ముగ్గురు తమ సేవలను అందించడం ప్రారంభిస్తారు. మొత్తం 10 మంది పెన్షన్ ఫండ్ మేనేజర్‌లను చందాదారులు సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అన్ని అసెట్ క్లాస్‌లు ఒకే ఫండ్ మేనేజర్ నిర్వహించేవారు. అయితే ప్రభుత్వేతర సబ్‌స్క్రైబర్‌లు వారు పెట్టుబడి పెట్టే ప్రతి అసెట్ క్లాస్‌కి ప్రత్యేక ఫండ్ మేనేజర్‌ను నియమించుకుంటారు.

ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. మిగతా సమయం వ్యవసాయం చేయాలని పిలుపు


NPS టైర్ II ఖాతాలో ఈక్విటీకి 100 శాతం కేటాయింపును అనుమతించాలని PFRDA యోచిస్తోంది. త్వరలో NPSకి చందాదారులు ప్రతి పెన్షన్ ఫండ్ మేనేజర్ NPS పథకం రిస్క్ ప్రొఫైల్‌ను కూడా చూడగలరు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు రిస్క్-ఓ-మీటర్ కాన్సెప్ట్‌పై అవగాహన ఉంటుంది. ఇది పథకం పోర్ట్‌ఫోలియో తీసుకున్న రిస్క్ స్థాయిని పెట్టుబడిదారుడికి తెలియజేస్తుంది. NPSలో ఇదే విధమైన కొలత చందాదారులకు మరింత సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడంలో కూడా సహాయపడుతుంది.NPS మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తుంది. అయితే అందరు చందాదారులు ఈ భావనతో సౌకర్యవంతంగా ఉండరు. PFRDA సబ్‌స్క్రైబర్‌ల కోసం కనీస హామీ ఇచ్చిన రిటర్న్‌ల పథకాన్ని అందించే ప్రతిపాదనపై పని చేస్తోంది.
Published by:Mahesh
First published:

Tags: NPS Scheme, Pension Scheme, Pensioners, Pensions

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు