SBI Yono: ఎస్​బీఐ కస్టమర్లకు బిగ్​ అలర్ట్​.. ఇలా చేస్తేనే యోనో యాప్‌లోకి ఎంట్రీ

ప్రతీకాత్మక చిత్రం

SBI Yono: యోనో యాప్​ను దాదాపు ప్రతి ఎస్​బీఐ కస్టమర్​ ఉపయోగింస్తుంటారు. అయితే, ఇప్పుడీ యోనో యాప్​లో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు చేర్చింది ఎస్​బీఐ.

  • Share this:
ఇటీవలి కాలంలో ఆన్​లైన్​ మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన ఖాతాదారులకు భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ కొన్ని కఠిన నియమ నిబంధనలను చేర్చింది. ఈ భద్రతా నియమాలు పాటించని కస్టమర్ల అకౌంట్లను స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. కాగా, బ్యాంకుకు నేరుగా వెళ్లకుండా ఇంట్లో నుంచే అన్ని పనులు చక్కబెట్టుకునేందుకు ఎస్​బీఐ యోనో అనే యాప్​ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యోనో యాప్​ను దాదాపు ప్రతి ఎస్​బీఐ కస్టమర్​ ఉపయోగింస్తుంటారు. అయితే, ఇప్పుడీ యోనో యాప్​లో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు చేర్చింది ఎస్​బీఐ.

ఈ నిబంధనల ప్రకారం, మీ బ్యాంక్​ అకౌంట్​కు లింక్​ అయిన నెంబర్​తోనే యోనో యాప్​లోకి లాగిన్​ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ నెంబర్​ గల సిమ్​ మీ మొబైల్​లో తప్పనిసరిగా ఉండాలి. మరో నెంబర్​ ద్వారా లాగిన్​కు ప్రయత్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అది సాధ్యం కాదని ఎస్​బీఐ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఎస్​బీఐ ఒక ట్వీట్​ ద్వారా వెల్లడించింది. "యోనో యాప్​తో సురక్షితంగా బ్యాంకింగ్ సదుపాయాలు వినియోగించుకోండి. యోనో యాప్​ భద్రతా ప్రమాణాలను మరింత పెంచాం. ఇకపై బ్యాంకులో నమోదు చేసుకున్న ఫోన్​ నెంబర్​తో మాత్రమే యోనో యాప్​లోకి లాగిన్​ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ మార్పును గమనించగలరు.’’ అంటూ ట్వీట్​లో పేర్కొంది.

ఎందుకీ కొత్త నియమం?
కరోనా లాక్​డౌన్​ కారణంగా ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు బ్యాంకులు సైతం తమ పనివేళలు తగ్గించాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్ వైపు ఎక్కువగా మొగ్గుచూపారు. సరిగ్గా ఇదే సైబర్​ నేరగాళ్లకు వరంగా మారింది. సైబర్​ కేటుగాళ్లు సులభంగా కస్టమర్ల పేరు, పాస్​వర్డ్​ వంటివి తెలుసుకొని వారి అకౌంట్లలోని డబ్బులు కాజేస్తున్నారు. ఫలితంగా, తమకు తెలియకుండానే అకౌంట్​ నుంచి అమౌంట్​ డెబిట్​ అవుతుందని అనేక మంది కస్టమర్ల నుంచి ఎబ్​బీఐకి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి.

ఇదే విషయంపై 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య కాలంలో ఎఫ్​ఐఎస్​ 2 వేల మంది కస్టమర్లపై సర్వే చేసింది. సర్వేలో పాల్గొనేవారిలో 34% మంది గతేడాది కాలంగా ఆర్థిక మోసాలకు గురయ్యామని చెప్పారు. ఇక, 25- నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో 41% మంది సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకున్నామని తెలిపారు. కాగా, 2020 డిసెంబర్​ చివరి నాటికి దాదాపు 32 మిలియన్ల మంది ఎస్​బీఐ యోనో యాప్ యూజర్లు ఉన్నారు.
Published by:Kishore Akkaladevi
First published: