హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jobs: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు!

Jobs: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు!

 ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు!

ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు!

New Jobs | ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? భారీగా ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. దీంతో ఫ్రెషర్లకు మంచి జాబ్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Job Vacancies | ఉద్యోగం కోసం చూస్తున్నారా? జాబ్ (Jobs) వేటలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు ఫ్రెషర్స్ అయితే మీకోసం భారీగా ఉద్యోగాలు అందుబాటులోకి రాబోతున్నాయి. నాలుగైదు దిగ్గజ కంపెనీలు నియమాకాలను చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో ఫ్రెషర్లకు (Freshers) జాబ్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఏ ఏ కంపెనీలు ఫ్రెషర్ల కోసం చూస్తున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

  కన్సల్టింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలు మెకన్సీ, బీసీజీ, ఈవై, పీడబ్ల్యూసీ, డెలాయిట్ వంటి సంస్థలు నియామకాలను చేపట్టాలని చూస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది క్యాంపర్ రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని భావిస్తున్నాయి. అమెరికాలో ఆర్థిక సంక్షోభ భయాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్న తరుణంలో కూడా ఈ కంపెనీలు భారత్‌లో నియమాలను చేపట్టడానికి రెడీ అవుతున్నాయి.

  అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

  ఈవై సంస్థ దాదాపు 10 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తోంది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోనుంది. దీని ద్వారా ఇటు భారత్‌లోనూ, అటు గ్లోబల్‌గా సర్వీసులను విస్తరించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అలాగే బీసీజీ కూడా 2023లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను డబుల్ చేయాలని చూస్తోంది. కోవిడ్ 19 కన్నా ముందు ఎంత మందిని అయితే రిక్రూట్ చేసుకుందో ఇప్పుడు వారికి రెట్టింపు సంఖ్యలో నియమాలను చేపట్టనుంది.

  వారికి అదిరే గుడ్ న్యూస్.. వీరికి భారీ షాక్! అక్టోబర్ 1 నుంచి..

  మెకన్సీ కూడా నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. కన్సల్టింగ్ సపోర్ట్‌లో అదిక డిమాండ్ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పీడబ్ల్యూసీ కూడా వచ్చే ఐదేళ్ల కాలంలో 10,000 మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. బిజినెస్ పరంగా చేస్తే ఇటు భారత్‌లో, అటు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన పెరుగుదల నమోదు అవుతోందని, అందుకే అధిక డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి రిక్రూట్‌మెంట్ చేసుకోవాల్సి ఉందని బీసీజీ ఇండియా ఎండీ, పార్ట్‌నర్, క్యాంపర్ రిక్రూటింగ్ చైర్ నటరాజన్ శంకర్ తెలిపారు.

  అలాగే మెకన్సీ పార్ట్‌నర్ ఆదిత్య శర్మ మాట్లాడుతూ.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను పెంచుకుంటామని తెలిపారు. 2022ను సానుకూలముగానే ముగించామని, 2021తో పోలిస్తే.. గత ఏడాదిలో రిక్రూట్‌మెంట్ 70 శాతం అధికంగా చేశామని పేర్కొన్నారు. ఇక 2023 విషయానికి వస్తే.. నియామకాల ప్రక్రియను కొనసాగిస్తామని వెల్లడించారు. అలాగే డెలాయిట్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ఎస్‌వీ నాథన్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో టాలెంట్ కొరత ఉందన్నారు. అయినా కూడా నియామకాలను చేపడతామని తెలిపారు. అయితే అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల కారణంగా ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Freshers, IT jobs, JOBS

  ఉత్తమ కథలు