Jio-Facebook Deal: జియో, ఫేస్‌బుక్ ఒప్పందంపై BIF ప్రశంసలు..

ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యంతో దేశంలోని 5 కోట్ల సూక్ష్మ,చిన్న, మధ్యతరహా వ్యాపారులు, 10 కోట్ల మంది రైతులు, 3 కోట్ల మంది చిన్న వర్తకులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని BIF అభిప్రాయపడింది.

news18-telugu
Updated: April 27, 2020, 3:42 PM IST
Jio-Facebook Deal: జియో, ఫేస్‌బుక్ ఒప్పందంపై BIF ప్రశంసలు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
జియో-ఫేస్‌బుక్ ఒప్పందం..! కరోనా సమయంలో జరిగిన ఈ డీల్ ఇప్పడు ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది. ఆ రెండు దిగ్గజ కంపెనీల కలయికపై తాజాగా బ్రాడ్‌బాండ్ ఇండియా ఫోరమ్ (BIF) ప్రశంసలు కురిపించింది. జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడి దేశంలోని డిజిటల్ సర్వీసెస్ సెక్టార్‌కు మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడింది. కోవిడ్ 19 మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదలేయిందని.. ఇలాంటి సమయంలో జియో- ఫేస్‌బుక్ ఒప్పందం చేసుకోవడం వల్ల దేశ ఆర్ధికవ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశముందని తెలిపింది.

ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యంతో దేశంలోని 5 కోట్ల సూక్ష్మ,చిన్న, మధ్యతరహా వ్యాపారులు, 10 కోట్ల మంది రైతులు, 3 కోట్ల మంది చిన్న వర్తకులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని BIF అభిప్రాయపడింది. అసంఘటిత రంగంలో కోట్ల మంది లాభపడతారని.. జియోమార్ట్, వాట్సప్ కలయికతో కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయని తెలిపింది. జియోమార్ట్‌తో చిన్న వ్యాపారులతో పాటు వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందని.. మెరుగైన సేవలు వారికి అందుతాయని అభిప్రాయపడింది.

ఈ ఒప్పందంతో భారత్ మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలుంటాయి. తద్వారా దేశంలో బ్రాడ్ బ్యాండ్ ఎకోసిస్టమ్ బలోపేతమవుతుంది. డేటా వినియోగంలో ఇప్పటికే భారత్ బెంచ్ మార్క్‌‌ సెట్ చేసింది. మనదేశంలో వినియోగదారులు నెలకు సగటున 11 జీబీ డేటా వాడుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ వలన దేశంలో సామాజిక ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడుతుంది.
టీవీ రామచంద్రన్, BIF ప్రెసిడెంట్



భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.43,574 కోట్లకు ఈ వాటాను దక్కించుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలు వల్ల జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్‌బుక్ నిలిచింది. డిజిటల్ వ్యాపారం వేగంగా పుంజుకునే దిశగా రిలయన్స్ జియో, ఫేస్‌బుక్ వేసిన అడుగులు ఇండియాలోని లక్షల మంది చిన్న వ్యాపారులకు, కోట్లాది వినియోగదారులకు మేలు చేయనుంది. ఈ డీల్ వల్ల జియో మార్ట్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లనుంది. అందుకు ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ సపోర్టు తీసుకోనుంది. చిన్న వ్యాపారులకు, కస్టమర్లకు మేలు చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయని జియో కూడా ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక కిరాణా స్టోర్లతో వినియోగదారులు అనుసంధానం అయ్యేందుకు జియో మార్ట్, వాట్సాప్ ఉపయోగపడనున్నాయని వెల్లడించింది. వినియోగదారునికి కావాల్సిన సరుకులను స్థానిక కిరాణా స్టోర్ నుంచి ఎలాంటి మినిమమ్ ఆర్డర్ లేకుండా ఇంటికే చేర్చేలా జియో మార్ట్, వాట్సాప్ వివరించింది. దీంతో జియో మార్ట్ మార్కెట్‌లో దూసుకెళ్లడమే కాకుండా, వాట్సాప్‌కు కొత్త యూజర్లు వస్తారు. తద్వారా బిజినెస్ పెరిగి కోట్ల మంది చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది.
First published: April 27, 2020, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading