BHOPAL POLICE SERVES NOTICE TO AMAZON IN AN INSULT TO NATIONAL EMBLEMS CASE AND FILES FIR AGAINST SELLERS MK
Bhopal Police Serves Notice to Amazon: జాతీయ పతాకాన్ని అవమానించిన అమెజాన్, FIR నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు..
ప్రతీకాత్మకచిత్రం
అమెజాన్ ప్లాట్‌ఫారమ్ పై త్రివర్ణ పతాకం ప్రింట్‌తో అనేక ఉత్పత్తులను విక్రయించినందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులు మంగళవారం సాయంత్రం కంపెనీకి చెందిన పలువురు విక్రేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Bhopal Police Serves Notice to Amazon: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు ఇబ్బందుల్లో పడింది. అమెజాన్ ప్లాట్‌ఫారమ్ పై త్రివర్ణ పతాకం ప్రింట్‌తో అనేక ఉత్పత్తులను విక్రయించినందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులు మంగళవారం సాయంత్రం కంపెనీకి చెందిన పలువురు విక్రేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్రివర్ణ పతాకం ఉన్న బూట్లతో సహా పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న విక్రేతలతో పాటు, అమెజాన్ యజమాని , సంస్థ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించిన కొన్ని గంటల్లోనే కేసు నమోదు చేశారు. భోపాల్ పోలీస్ కమీషనర్ మకరంద్ డ్యూస్కర్ మాట్లాడుతూ, “అమెజాన్‌లో త్రివర్ణ ముద్రణతో బూట్లతో సహా అనేక ఉత్పత్తులను విక్రయించినందుకు భోపాల్ క్రైమ్ బ్రాంచ్‌లో విక్రేతలపై జాతీయ చిహ్నాల అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్ 2 , IPC సెక్షన్ 505 (2) కేసు నమోదు చేశామని, తదుపరి చర్య కొనసాగుతోందని పేర్కొన్నారు.
కొన్ని గంటల క్రితం భోపాల్‌లో హోంమంత్రి మాట్లాడుతూ, “అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై మన జాతీయ జెండాను ఉపయోగిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. బూట్లపై కూడా ఉపయోగించారని తేలింది. ఇది భరించలేని చర్యగ అభివర్ణించారు. ప్రాథమికంగా చూస్తే ఇది జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. అమెజాన్ అధికారులతో పాటు యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిజిపిని ఆదేశించినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది
అమెజాన్ తన ఉత్పత్తులలో కొన్ని త్రివర్ణ పతాక చిత్రాలను కలిగి ఉండటంతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంది. ఈ విధంగా త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించడం అవమానకరమని, ఇది దేశ ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని కొందరు వినియోగదారులు మండిపడతున్నారు.
ఇదిలా ఉంటే అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి పోలీసులను ఆదేశించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా అమెజాన్‌పై రెండు వేర్వేరు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హోంమంత్రి ఆదేశించారు.
శుభం నాయుడు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
భోపాల్‌కు చెందిన 26 ఏళ్ల శుభం నాయుడు ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 24న ఉదయం 8 గంటలకు కంపెనీ సైట్‌లోని టీ షర్టులు, షూలు, మగ్‌లపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించి అమెజాన్ కంపెనీలో గుర్తుతెలియని అమ్మకందారులు బహిరంగంగా విక్రయించడం తనను అవమానించడమేనని నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.