డిసెంబర్ 1 నుంచి కాల్ టారిఫ్ చార్జీలను పెంచనున్న భారతీ ఎయిర్‌టెల్...

గడిచిన దశాబ్ద కాలంగా టారిఫ్‌లను తగ్గిస్తూ వచ్చిందని, టెలికాం రంగంలోని పోటీ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 8:50 PM IST
డిసెంబర్ 1 నుంచి కాల్ టారిఫ్ చార్జీలను పెంచనున్న భారతీ ఎయిర్‌టెల్...
(ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా తన కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి టారిఫ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా టారిఫ్‌లను తగ్గిస్తూ వచ్చిందని, టెలికాం రంగంలోని పోటీ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. అందుకే కాల్ టారిఫ్ చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. ఇదిలా ఉంటే భారతీ ఎయిర్‌టెల్ ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.23,045 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. అంతేకాదు ట్రాయ్‌కు పలు బకాయిలు చెల్లించాలన్న ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఫలితాలపై ఒత్తిడి నెలకొన్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. క్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.118.80 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>