• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • BHARTI AIRTEL OFFERS RS 2 LAKH LIFE INSURANCE COVER WITH NEW RS 179 PREPAID PLAN SS

Airtel: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్... రూ.179 రీఛార్జ్‌తో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్

Airtel: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్... రూ.179 రీఛార్జ్‌తో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Rs 179 prepaid plan | సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నవారి కోసం రూ.179 రీఛార్జ్ ప్లాన్‌ను రూపొందించింది ఎయిర్‌టెల్.

  • Share this:
    మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీకు గొప్ప శుభవార్త. భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ ప్రకటించింది. రూ.179 రీఛార్జ్ చేసుకునేవారికి రూ.2 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా లాంటి ప్రయోజనాలున్నాయి. వాటితో పాటు కస్టమర్లకు రూ.2 లక్షల బీమా అందిస్తోంది భారతీ ఎయిర్‌టెల్. ఇందుకోసం భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ రీటైల్ స్టోర్ లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని చెబుతోంది ఎయిర్‌టెల్. సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నవారి కోసం రూ.179 రీఛార్జ్ ప్లాన్‌ను రూపొందించింది ఎయిర్‌టెల్.

    Airtel Rs 179 Plan: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌తో లాభమిదే...


    రూ.179 రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ మొబైల్ డేటా లభిస్తాయి. దాంతో పాటు భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ నుంచి రూ.2 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. 18 నుంచి 54 ఏళ్ల వయస్సుగల వారెవరైనా రూ.179 ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఎలాంటి పేపర్ వర్క్, మెడికల్ టెస్ట్ అవసరం లేదు. పాలసీ సర్టిఫికెట్ డిజిటల్ రూపంలో వస్తుంది. కోరుకున్నవారికి ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్ ఫిజికల్ కాపీని పంపిస్తారు. రూ.179 ప్లాన్ కాకుండా ఎయిర్‌టెల్ నుంచి ఇతర ప్లాన్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి

    SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్స్

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
    Published by:Santhosh Kumar S
    First published: