Airtel Data Plans: ఎయిర్‌టెల్ సరికొత్త డేటా ప్లాన్.. అతి తక్కువ ధరకే డేటా.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio తక్కువ ఖరీదుకే రోజూ అపరిత డేటాను, అధిక వేగంతో పరిమిత డేటాను వినియోగదారుల ముందుంచింది. దీంతో ఇతర నెట్వర్క్ సంస్థలకు జియోతో పోటీపడక తప్పడం లేదు. ఈ దిశగానే భారతి ఎయిర్‌టెల్(Airtel) సంస్థ ప్రయాణిస్తోంది.

  • Share this:
4జీ నెట్వర్క్ సర్వీసులు వచ్చిన తర్వాత డేటా బ్యాలెన్స్(Data Balance) చాలా చౌక ధరకే అందుబాటులోకి వస్తోంది. ఈ అంశంపై ముందుగా అడుగులు వేసింది రిలయన్స్ జియోనే(Reliance Jio). తక్కువ ఖరీదుకే రోజూ అపరిత డేటాను, అధిక వేగంతో పరిమిత డేటాను వినియోగదారుల ముందుంచింది జియో. దీంతో ఇతర నెట్వర్క్ సంస్థలకు జియోతో పోటీపడక తప్పడం లేదు. ఈ దిశగానే భారతి ఎయిర్‌టెల్(Airtel) సంస్థ ప్రయాణిస్తుంది. తాజాగా రూ.199ల ప్రీపెయిడ్ రీచార్జ్ కే 1.5 జీబీ రోజువారీ డేటాను 28 రోజుల కాలపరిమితితో అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. కొన్ని రోజుల క్రితం ఇంటర్ కనెక్ట్ యూసేజ్ తొలగింపును ప్రకటించినప్పుడు జియో ఉత్తమ ప్రీపేయిడ్ ప్లాన్స్ ను కలిగి ఉండగా.. తాజాగా ఎయిర్‌టెల్ కూడా ఆ సంస్థ సరసన చేరింది. ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పటి వరకు రూ.199 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ ను 24 రోజుల పాటు 1జీబీ(రోజూ వారీ) మాత్రమే ఇచ్చింది.

తాజా ప్రకటనతో ఇదే ధరకు 1.5 జీబీ రోజువారీ డేటాను 28 రోజుల పాటు వినియోగదారులు పొందవచ్చు. అయితే ఈ రీచార్జ్ ఆప్షన్ ను కొన్ని ప్రాంతాలకే అందులోనూ కొన్ని ఎంపిక చేసిన నెంబర్లకే పరిమితం చేసింది ఎయిర్‌టెల్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్లో ఈ డేటా ప్లాన్ అందుబాటులో ఉంటుందని, కర్ణాటక టెలికాం సర్కిల్ ఈ ఆఫర్ లభ్యత కోసం తనిఖీ చేస్తున్నట్లు తన వెబ్ సైట్ లో ప్రకటించింది ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ రూ .199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందిస్తోంది.

ఇది ఇప్పుడు జియో(Jio) రూ .199 ప్రీపెయిడ్ రీఛార్జికి అనుగుణంగా 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తోంది. ఇంతకు ముందు ఎయిర్‌టెల్ వినియోగదారులు 1.5జీబీ డేటా ప్లాన్ కావాలంటే రూ.249తో రిచార్జ్ చేసుకోవాల్సి ఉండేది. తాజాగా రూ.199 ప్లాన్ గా సవరించారు. దీంతో రూ.199లకు 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ చొప్పున 42జీబీ డేటాను వాడుకోవచ్చు. అంతే కాకుండా భారత్ లో ఏ నెట్వర్క్ కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంస్ లు పంపుకోవచ్చు.

వీటితో పాటు అదనపు ప్రయోజనాలుగా ఈ ప్లాన్ లో ఉచిత హలో ట్యూన్లు, అపరిమితి డౌన్ లోడ్, వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్, 350 కంటే ఎక్కువ ఛానళ్లను ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ద్వారా పొందవచ్చు. రూ.249 డేటా ప్లాన్ ను పునరుద్ధరించి రిచార్జ్ చేసుకోవాల్సిన మొబైల్ నెంబర్లకు అనుసంధించారు. రూ .249 ప్లాన్ అదనపు ప్రయోజనాలలో రూ .100 ఫాస్టాగ్ క్యాష్‌బ్యాక్ మరియు షా అకాడమీ ఆన్‌లైన్ కోర్సులు కూడా ఈ నూతన ప్లాన్ లో ఉన్నాయి. రూ. 199, రూ .249 ప్లాన్‌ల మధ్య ఎయిర్‌టెల్‌లో రూ .219 ప్యాక్ ఉంది, రోజుకు 1 జీబీ డేటాతో 28 రోజులు ఉంటుంది. ఎయిర్‌టెల్ తాజా ప్రకటనతో మరి జియో ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.
Published by:Nikhil Kumar S
First published: