మరో రూ.8004 కోట్లు చెల్లించిన భారతీ ఎయిర్‌టెల్

ప్రతీకాత్మకచిత్రం

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 2020 ఫిబ్రవరి 17 న కంపెనీ రూ .10,000 కోట్లు చెల్లించగా, అందుకు అదనంగా మరో రూ.8,004 కోట్లు చెల్లించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

  • Share this:
    భారతీ ఎయిర్‌టెల్ శనివారం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంకు అదనంగా రూ.8,004 కోట్లు చెల్లించింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 2020 ఫిబ్రవరి 17 న కంపెనీ రూ .10,000 కోట్లు చెల్లించగా, అందుకు అదనంగా మరో రూ.8,004 కోట్లు చెల్లించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ లెసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద మొత్తం రూ.35586 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2019 డిసెంబర్ 31 వరకు స్వీయ-అంచనా ప్రాతిపదికన తమ చెల్లింపులను లెక్కించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే చెల్లింపులో ఫిబ్రవరి 29, 2020 వరకు వడ్డీ కూడా వర్తించిందని తెలిపింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్)ని కంపెనీ 2006-07 ఆర్థిక సంవత్సరం నుండి 2019 డిసెంబర్ 31 వరకు లెక్కించినట్లు పేర్కొంది. మరియు దానిపై వడ్డీని ఫిబ్రవరి 29, 2020 వరకు లెక్కించినట్లు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. దీని ప్రకారం, 2020 ఫిబ్రవరి 17 న భారతి గ్రూప్ ఆఫ్ కంపెనీల తరఫున చెల్లించిన రూ .10,000 కోట్ల మొత్తానికి మించి, కంపెనీ అదనంగా రూ. 3,004 కోట్ల రూపాయలు చెల్లించింది" అని ఫైలింగ్ తెలిపింది. .

    ఈ చెల్లింపులో భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్ మరియు టెలినార్ ఇండియా బాధ్యత వహించింది. తాత్కాలిక చెల్లింపుగా మేము అదనంగా 5,000 కోట్ల రూపాయలను కూడా జమ చేసామని ఎయిర్టెల్ తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం అంచనాల ప్రకారం, ఎయిర్టెల్ చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ .35,586 కోట్లుగా ఉంది. ఇందులో లైసెన్స్ ఫీజు, చెల్లించని మొత్తానికి వడ్డీ, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, జరిమానా, దానిపై వడ్డీ కలిపి ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ 24, 2019 సుప్రీంకోర్టు ఉత్తర్వులలో AGR తీర్పు మరియు ఆదేశాలను పాటించామని కంపెనీ తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published: