భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాల కొనుగోలుకు అమెజాన్ ఆసక్తి...

(ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఒప్పందం జరిగితే, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అమెజాన్ సంస్థ, భారతి ఎయిర్‌టెల్‌లో 5శాతం వాటాను పొందుతుంది.

 • Share this:
  భారత టెలికాం రంగంలో మరో అతిపెద్ద డీల్ తెరపైకి వచ్చింది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం అమెజాన్, భారతి ఎయిర్‌టెల్‌లో వాటా తీసుకోవడానికి సిద్దమైంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అమెజాన్ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారత్ లో డిజిటల్ ఎకానమీ నుండి లబ్ది పొందటానికి, అమెజాన్ వాటా తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

  ఈ ఒప్పందం జరిగితే, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అమెజాన్ సంస్థ, భారతి ఎయిర్‌టెల్‌లో 5శాతం వాటాను పొందుతుంది. ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ దేశంలో మూడవ అతిపెద్ద టెలికం సంస్థ. దీని మొత్తం కస్టమర్ల సంఖ్య సుమారు 30 కోట్లు.

  అయితే ఈ డీల్ విషయమై ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు సంస్థల మధ్య చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపాయి. ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం జరగలేదు. అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ, "మార్కెట్ ఊహాగానాలపై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేమని" తెలిపారు.

  ఈ విషయంలో భారతి ఎయిర్‌టెల్‌ను సంప్రదించగా, తమ ఉత్పత్తులు, సేవను విస్తరించేందుకు పెట్టుబడుల కోసం పలు ప్రపంచ స్థాయి డిజిటల్ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఇండియన్ మార్కెట్ వృద్ధి గురించి అమెజాన్ చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ తన వ్యాపారాన్ని విస్తరించడానికి 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.
  Published by:Krishna Adithya
  First published: