BHARATPE LAUNCHED DIGITAL GOLD PLATFORM CUSTOMERS CAN BUY GOLD FOR JUST AT RS 1 SS
Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా
Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Gold | బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొనాలనుకొని కొనలేకపోయినవారున్నారు. బంగారం ధర పెరుగుతుందో తగ్గుతుందో తెలియక ఆగిపోయారు. అందుకే బంగారంపై కొద్దికొద్దిగా పొదుపు చేయడం మంచిది. మీరు ఒక్క రూపాయితో కూడా బంగారంపై పొదుపు చేయొచ్చు.
బంగారం కొనాలంటే వేలకు వేల రూపాయలు ఉండాలనుకుంటారు. కానీ పొదుపు చేసే ఆలోచన ఉంటే ఒక్క రూపాయితో మొదలుపెట్టొచ్చు. మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి లక్షల రూపాయలు అవసరం లేదు. కేవలం ఒక్క రూపాయి ఉన్నా బంగారం కొనొచ్చు. పొదుపు చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే పేటీఎంతో పాటు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు ఒక్క రూపాయికే బంగారం అమ్ముతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన భారత్‌పే కూడా డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. సేఫ్‌గోల్డ్‌తో కలిసి ఈ ప్రొడక్ట్ అందిస్తోంది. కస్టమర్లు డిజిటల్ గోల్డ్ కొనడానికి, అమ్మడానికి సేఫ్‌గోల్డ్ వేదికగా నిలుస్తోంది. లాంఛ్ చేసిన రోజే 200 గ్రాముల డిజిటల్ గోల్డ్ అమ్మినట్టు భారత్‌పే గ్రూప్ ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ తెలిపారు. దీపావళి నాటికి 6 కిలోలు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 30 కిలోల డిజిటల్ గోల్డ్ అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
డిజిటల్ గోల్డ్ అమ్మడంలో, కొనడంలో సేఫ్‌గోల్డ్ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌పే యూజర్లు ఎక్కడ్నుంచైనా ఏ సమయంలో అయినా బంగారం కొనొచ్చు. ఎప్పుడు ఎంత మొత్తంలో డబ్బు ఉంటే అంత మొత్తంతో బంగారాన్ని కొనే అవకాశం కల్పించడమే డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత. బంగారంలో పొదుపు చేయాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో బంగారం కొంటే ఫిజికల్ గోల్డ్ ఇవ్వరు. బంగారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఉంటుంది. ఆరోజు ఎంత రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారం బంగారాన్ని కేటాయిస్తారు. 24 క్యారెట్ ప్రకారం లెక్కిస్తారు. ఆ బంగారాన్ని మీకు నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు. కస్టమర్లు కొన్న బంగారం సురక్షితంగా ఉంటుందా అన్న అనుమానం రావొచ్చు. కస్టమర్ల బంగారాన్ని సేఫ్‌గా కాపాడేందుకు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌ను నియమించింది సేఫ్‌గోల్డ్. కస్టమర్లు కొన్న బంగారం లాకర్లలో భద్రంగా ఉంటుంది. లాకర్ ఛార్జీలు కూడా ఉండవు.
కస్టమర్లు ఈ డిజిటల్ గోల్డ్‌ను ఫిజికల్ గోల్డ్‌గా కూడా మార్చుకోవచ్చు. అంటే కొన్ని నెలల పాటు కొంచెంకొంచెం పొదుపు చేసినవారు చివర్లో కావాలంటే ఫిజికల్ గోల్డ్‌కు ఆర్డర్ ఇవ్వొచ్చు. జమ చేసిన మొత్తానికి ఫిజికల్ గోల్డ్ మీ ఇంటికి డెలివరీ చేస్తారు. లేదా డిజిటల్ గోల్డ్ అమ్మితే డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.