Multibagger Share | భారీ లాభాలు పొందాలని భావించే వారికి స్టాక్ మార్కెట్ (Stock Market) మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే షేర్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అంటే పెట్టిన డబ్బులు (Money) కూడా రాకపోవచ్చు. లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని గుర్తించుకోవాలి. అందుకే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే వారు జాగ్రత్తగా ఉండాలి.
అయితే మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించి ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటి స్టాక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రభుత్వ రంగానికి చెందిన ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ అదిరిపోయే లాభాన్ని అందించింది. ఈ షేరు ఏకంగా రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 5 కోట్లుగా మార్చేసింది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరే శుభవార్త.. ఇకపై అందరికీ..
భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు ఏకంగా 45 వేల శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. షేరు ధర 20 పైసల నుంచి రూ. 100 పైకి చేరింది. దీంతో ఈ షేరులో దీర్ఘకాలం నుంచి డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 114.65గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 77 వేల కోట్లుగా ఉంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త కారు!
ఈ కంపెనీ షేరు 1999 జూన్ 4న కేవలం 20 పైసలు మాత్రమే. కానీ ఇప్పుడు షేరు ధర రూ.105కు చేరింది. అంటే షేరు ఏకంగా 47 వేల శాతానికి పైగా ర్యాలీ చేసింది. అంటే భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 1999లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ. 5.3 కోట్లకు చేరి ఉండేది.
భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు ధర గత రెండున్నర ఏళ్లలో భారీ లాభాన్ని అర్జించి పెట్టింది. ఈ షేరు ధర 2020 మే నెలలో 19.9 వద్ద ఉండేది. 2022 అక్టోబర్ 28 నాటికి స్టాక్ ధర రూ. 105కు చేరింది. అంటే షేరు రెండున్నర ఏళ్లలో రూ.20 నుంచి రూ. 105కు పరుగులు పెట్టింది. అంటే రెండేళ్ల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ. 5.3 లక్షలు వచ్చేవి. పదేళ్లలో చూస్తే.. షేరు రూ.లక్షను రూ. 8.89 లక్షలుగా మార్చింది. 2012లో స్టాక్ ధర రూ. 11.85 వద్ద ఉండేది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks