MSME: చిన్న పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. అమెజాన్, అలీబాబాకు ధీటుగా ఈ-కామర్స్ పోర్టల్

ప్రతీకాత్మక చిత్రం

భారత్ క్రాఫ్ట్ అని పిలిచే ఈ-కామర్స్ పోర్టల్‌ను 2019లో మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇదే పనిలో ఉంది. MSMEల మార్కెటింగ్ మద్దతు కోసం తాము అలీబాబా లాంటి ఈ-పోర్టల్‌ను సృష్టించబోతున్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

  • Share this:
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(MSME)కు కేంద్రం శుభవార్త చెప్పింది. సులభతర వాణిజ్యంలో భాగంగా ఆ మంత్రిత్వశాఖ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో(SBI) కలిసి MSMEల కోసం ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇది భారత్‌లో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి, విక్రయించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అమెజాన్, అలీబాబా మాదిరిగా ఎంఎస్ఎఈ ప్లాట్ ఫాం ఉంటుంది. ఆల్ ఇండియా అసోసియోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వెబినార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలియజేశారు.

భారత్ క్రాఫ్ట్ అని పిలిచే ఈ-కామర్స్ పోర్టల్‌ను 2019లో మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇదే పనిలో ఉంది. MSMEల మార్కెటింగ్ మద్దతు కోసం తాము అలీబాబా లాంటి ఈ-పోర్టల్‌ను సృష్టించబోతున్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ కు తీసుకెళ్లేందుకు ఇది ప్రత్యక్ష గేట్ వే అని, అందుకే తాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా తాము దీన్ని సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

MSMEలను ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు విక్రయించడంలో సహాయపడటానికి ప్రభుత్వం ప్రస్తుతం బిజినెస్-టు-బిజినెస్ గవర్నెమెంట్ మార్కెట్ ప్లేస్ కలిగి ఉంది. ప్రైవేటు వ్యాపారల కోసం ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. MSMEలు వినియోగదారులకు నేరుగా విక్రయించ గలిగే ప్రభుత్వ యజమాన్యంలోని బీ2సీ మార్కెట్ ను ప్రారంభించడంతో ఇది ఫిప్ కార్ట్, అమేజాన్ ఇండియా, స్నాప్ డీల్ సహా మరెన్నో ప్రైవేటు అధికారులతో పోటీపడుతుంది. త్వరలో ఈ ప్లాట్ ఫాంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ చూడాలని, ఇది ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని గడ్కరీ అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఎమర్జ్ ప్లాట్ ఫాం 2019 ప్రకారం ఎంఎస్ఎంఈ 200వ స్థానంలో నిలిచింది.

భారత్ ఈ-కామర్స్ మార్కెట్ 2018లో 50 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 84 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 నాటికి 188 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2020లో 100-110 మిలియన్ల నుంచి 2025 నాటికి భారత్ లో 300-350 మిలియన్ల ఆన్ లైన్ దుకాణాదారులను కలిగి ఉంటుందని బైన్ అండ్ కంపెనీ, ఫ్లిప్ కార్టు నివేదిక పేర్కొంది. అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ తదితరుల నేతృత్వంలో ఈ-రీటైల్ మార్కెట్ స్థూల వస్తువుల విలువలో దాదాపు 30 శాతం సీఏజీఆర్ కు దారితీస్తుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 30 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 100 నుంచి 120 బిలియన్లకు పెరుగుతుంది.
Published by:Shiva Kumar Addula
First published: