e-Scooter | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం కళ్లుచెదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు మీ పాత టూవీలర్ ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Vehicle) కొంటే మీరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల (Scooter) తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్న్న బిగౌస్ ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది.
మీరు మీ పాత టూవీలర్ ఇచ్చేసి బిగౌస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఏకంగా రూ. 25 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు మీ పాత టూవీలర్‌ను దగ్గరిలోని బిగౌస్ డీలర్‌షిప్ వద్దకు తీసుకువెళ్లాలి. అక్కడ మీ వెహికల్‌కు బెస్ట్ ప్రైస్ అందిస్తారు. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. తర్వాత మీరు మీకు నచ్చిన బిగౌస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంచుకోవాలి. మీకు వచ్చిన ఎక్స్చేంజ్ తగ్గింపు డిస్కౌంట్ చేసి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
రూ.70 వేలలోపు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 7 బైక్స్ ఇవే!
కంపెనీ ప్రధానంగా డీ15, ఏ2, బీ8 అనే మూడు వెహికల్స్‌ను అందిస్తోంది. వీటిల్లో మనం డీ15 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 36 వేల కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. లేదంటే మూడేళ్ల వరకు వారంటీ వస్తుంది. ఇది రెండు రకాల వేరియంట్ల రూపంలో లభిస్తోంది. దీని ధర రూ. 99 వేల నుంచి ప్రారంభం అవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ. 1,14,999గా ఉంది.
హైస్పీడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ఒక్క రూపాయి కట్టకుండానే బుక్ చేసుకోండిలా!
ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చార్జ్ చేస్తే.. దాదాపు 115 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. గంటలకు 60 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఇంకా ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్స్, యాంటీ థెఫ్ట్ అలారం, జియో ఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్, రిమోట్ ఇమ్మోబిలైజేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వివిధ రంగుల ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. అందుబాటు ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు దీన్ని పరిశీలించొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీన్ని కలుపుకుంటే మీరు తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, SCOOTER