క్రెడిట్ స్కోర్‌కు సోషల్ మీడియాకు లింకేంటో తెలుసా?

ఫేస్‌బుక్, లింక్డిన్, ట్విట్టర్‌లాంటి సోషల్ మీడియా సైట్లలో ఎలా ఉంటారు? ఎలాంటి పోస్టులు చేస్తారు? అన్నవాటితో దరఖాస్తుదారుడి ప్రవర్తనను, విశ్వసనీయతను అంచనా వేస్తున్నాయి బ్యాంకులు. అంతేకాదు... అవసరమైతే దరఖాస్తుదారుడి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ వివరాలనూ విశ్లేషిస్తున్నాయి బ్యాంకులు. లింక్డ్‌ఇన్ ద్వారా దరఖాస్తుదారుడి ప్రొఫెషనల్ నెట్‌‍‌వర్క్, జాబ్‌ హిస్టరీని అంచనా వేస్తున్నాయి.

news18-telugu
Updated: October 19, 2018, 2:58 PM IST
క్రెడిట్ స్కోర్‌కు సోషల్ మీడియాకు లింకేంటో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియా... భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డా. మనసులో ఏదుంటే అది పోస్ట్ చేసేస్తుంటారు. తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడిస్తుంటారు. మంచిదే. కానీ... కొందరు ఈ స్వేచ్ఛను హద్దులు దాటిస్తుంటారు. పోస్టులు లక్ష్మణరేఖను దాటుతుంటాయి. ఎవరేం అనుకుంటే తనకేంటీ అన్నట్టుగా పోస్టులు పెడుతుంటారు. అయితే ఇలాంటి పోస్టులు చివరకు తమకే చిక్కులు తెచ్చిపెడతాయని ఊహించరు. ఇప్పుడు బ్యాంకులు కూడా మీ సోషల్ మీడియా యాక్టివిటీస్‌పై నిఘా పెడుతున్నాయి. మీరు ఎప్పుడైనా లోన్ కోసమో, క్రెడిట్ కార్డు కోసమో దరఖాస్తు చేసుకుంటే... మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ లాంటి అంశాలతో పాటు సోషల్ మీడియాలో మీ ప్రవర్తన గురించీ ఆరా తీస్తున్నాయి బ్యాంకులు.

బ్యాంకులు లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి సిబిల్ స్కోర్‌ ప్రామాణికం. సిబిల్ స్కోర్‌ని బట్టి అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలో, తిరస్కరించాలో నిర్ణయిస్తుంటాయి ఆర్థిక సంస్థలు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సిబిల్ స్కోర్‌తో పాటు ఇతర అంశాలనీ పరిశీలిస్తున్నాయి బ్యాంకులు. క్రెడిట్ స్కోరింగ్‌లో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని పాటిస్తున్నాయి. దరఖాస్తుదారుల ప్రవర్తనను, స్థాయిని అంచనా వేసేందుకు సోషల్ మీడియా యాక్టివిటీస్‌పైనా నిఘా పెట్టాయి. సిబిల్ స్కోర్‌తో పాటు వేర్వేరు మార్గాల్లో దరఖాస్తుదారుడికి సంబంధించిన ఇతర వివరాలను కూడా సేకరిస్తున్నాయి బ్యాంకులు, అప్పులు ఇచ్చే సంస్థలు.

క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీసే మీ సోషల్ మీడియా పోస్టులు!, Beware! Your social media activities can affect your creditworthiness
ఫేస్‌బుక్


ఏఏ వివరాలు సేకరిస్తాయి?
మొబైల్ ఫోన్ ఉపయోగించే తీరు, అప్లికేషన్‌లో ఇచ్చిన ఫోన్‌నెంబర్‌తో జరిపే పేమెంట్స్, లావాదేవీలు, బిల్లులు, ఈఎంఐలు చెల్లించిన పద్ధతి లాంటివన్నీ ఆరా తీస్తాయి బ్యాంకులు. అంతేకాదు... సదరు వ్యక్తి డిజిటల్ యాక్టివిటీపైనా నిఘా పెడుతున్నాయి. ఫేస్‌బుక్, లింక్డిన్, ట్విట్టర్‌లాంటి సోషల్ మీడియా సైట్లలో ఎలా ఉంటారు? ఎలాంటి పోస్టులు చేస్తారు? అన్నవాటితో దరఖాస్తుదారుడి ప్రవర్తనను, విశ్వసనీయతను అంచనా వేస్తున్నాయి. అంతేకాదు... అవసరమైతే దరఖాస్తుదారుడి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ వివరాలనూ విశ్లేషిస్తున్నాయి బ్యాంకులు. లింక్డ్‌ఇన్ ద్వారా దరఖాస్తుదారుడి ప్రొఫెషనల్ నెట్‌‍‌వర్క్, జాబ్‌ హిస్టరీని అంచనా వేస్తున్నాయి.

దరఖాస్తును మొదటి దశలోనే ఫిల్టర్ చేసేందుకు ఈ డేటా అంతా విశ్లేషిస్తుంటాయి. ఆ తర్వాతే వ్యక్తిగత, ఉద్యోగ, ఆర్థిక వివరాలను పరిశీలిస్తున్నాయి. ఇందుకోసం మెషీన్ లెర్నింగ్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇవన్నీ పరిశీలించి దరఖాస్తుదారుడి క్రెడిట్ ప్రొఫైల్ రూపొందిస్తున్నాయి. ఓ వ్యక్తి పేమెంట్ హిస్టరీనే కీలకంగా మారుతోంది. దాని ద్వారానే సదరు వ్యక్తికి అప్పు ఇస్తే తిరిగి చెల్లించే సత్తా ఉందా లేదా అన్న విషయం తెలుస్తుంది.

క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీసే మీ సోషల్ మీడియా పోస్టులు!, Beware! Your social media activities can affect your creditworthiness
ప్రతీకాత్మక చిత్రం
మరి మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఎలా రూపొందించుకోవాలి?
మీ సోషల్ మీడియా ప్రొఫైల్ బాగుంటే క్రెడిట్ ప్రొఫైల్ కూడా బాగుంటుంది.
మీరు సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు మీ ప్రవర్తనను తెలియజేసేవే.
జీవితంలో జాగ్రత్తగా స్నేహితుల్ని ఎంచుకున్నట్టే సోషల్ మీడియాలో కూడా స్నేహితుల్ని ఎంపికచేసుకోవాలి.
అప్పులు చేసి బ్యాంకుల్ని తిప్పలు పెట్టే స్నేహితులుంటే వారిని దూరం పెట్టడమే మంచిది.
ఆర్థిక క్రమశిక్షణ లేనివాళ్లను ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి తీసెయ్యండి.
మీ ప్రొఫెషనల్ ఆన్‌లైన్ ప్రొఫైల్స్ పూర్తి వివరాలతో అప్‌డేట్ చేస్తూ ఉండండి.
మీకు మంచి ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ ఉంటే ప్రొఫైల్‌లో యాడ్ చేయండి.
మీ పట్ల నెగిటీవ్ అభిప్రాయాన్ని కలిగించే పోస్టులు ఏవైనా ఉంటే తొలగించండి.
ఇలాంటివాటితో మీ విశ్వసనీయత పెరుగుతుంది.
లోన్, క్రెడిట్ కార్డులకు అప్లై చేసేముందు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డులో ఈ ఛార్జీలు మీకు తెలుసా?

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
First published: October 19, 2018, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading