• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • BEWARE OF ONLINE DATING APPS YOUR FRIEND MAY TAKE ALL YOUR MONEY EVEN WITHOUT KNOWING YOU MS

Online Dating Apps: మీరు నమ్మిన Friend మిమ్మల్ని మోసం చేయొచ్చు.. జాగ్రత్త...

Online Dating Apps: మీరు నమ్మిన Friend మిమ్మల్ని మోసం చేయొచ్చు.. జాగ్రత్త...

ప్రతీకాత్మక చిత్రం

Online Dating Apps: డేటింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కుప్పలు తెప్పలుగా పడున్నాయి. అయితే ఈ యాప్ ల ద్వారా మోసగాళ్లు.. తమకు పరిచయమైన వారి ఖాతాల్లోంచి.. వారికి కూడా తెలియకుండానే నగదు లాగేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

 • News18
 • Last Updated:
 • Share this:
  ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయిన వేళ.. అంతా ఆన్లైన్ మయం అయిపోయింది. కాలు కదపకుండా ఇంట్లోనే ఉంటూ మనకు కావాల్సిన పని చేసుకోవచ్చు. ఏ హోటల్ వంటకమైనా మనకు నచ్చింది తినొచ్చు. అంతా ఇంటి నుంచే. ఇంటర్నెట్ వాడకం పెరగడంతో యాప్ ల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ఏం కావాలన్నా సదరు యాప్ తెరవడం.. మనకు కావాల్సింది తీసుకోవడం.. అంతే. బోర్ కొట్టిందా..? బయటకు వెళ్లి ఫ్రెండ్స్ ను కలవాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ లోనే స్నేహితులు దొరుకుతున్నారు. మన ఊరు కాదు.. మన జిల్లా కాదు. అసలు మనదేశమే కాదు.. విదేశాల నుంచి కూడా స్నేహితులను సంపాదించొచ్చు. కానీ ఇలా ముక్కు ముఖం తెలియని స్నేహితుల వలలో పడి చాలా మంది నిండా మునుగుతున్నారు. తాజాగా 'FRIEND' యాప్ కూడా అదే పని చేస్తున్నదని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

  ఫ్రెండ్ (FRIEND) యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఇదో ఆన్లైన్ డేటింగ్ యాప్. ఇవేగాక డేటింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కుప్పలు తెప్పలుగా పడున్నాయి. అయితే ఈ యాప్ ల ద్వారా మోసగాళ్లు.. తమకు పరిచయమైన వారి ఖాతాల్లోంచి.. వారికి కూడా తెలియకుండానే నగదు లాగేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అంతర్జాతీయ పోలీసులు (ఇంటర్ పోల్) సుమారు 194 దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రెండ్ యాప్ ద్వారా అనేక మంది బాధితులు అవుతున్నారని.. వారికి తెలియకుండానే బాధితుల బ్యాంక్ ఖాతాల్లోంచి నగదు నిల్వలు తుడిచిపెట్టుకుపోతున్నాయని ఇంటర్ పోల్ తెలిపింది.

  ‘డేటింగ్ యాప్ గా ప్రాచుర్యం పొందిన ఈ యాప్స్ లో చేరిన కొత్తలో సదరు వ్యక్తులు సుతి మెత్తగా మాట్లాడి బాధితులను వారి మత్తులో దించుతారు. కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ.. వారిపై ఒక నిర్దిష్ట స్థాయి నమ్మకం ఏర్పాటయిన తర్వాత మెల్లగా అసలు సంగతి చెప్తారు. సదరు సంస్థలో పెట్టుబడులు పెట్టాలని బాధితులకు సూచిస్తారు. అంతేగాక ఈ నేరస్థులు ఒక ముఠాలా ఉంటారు. వారికి సంబంధించిన సంస్థల నుంచి ఉత్పత్తులను కొనాలని.. తద్వారా లాభాలు వస్తాయని ఆశ చూపుతారు. ట్రేడింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసి.. అందులో ఖాతా తెరవమని కోరుతారు. ఆ క్రమంలో మరికొంతమంది నేరగాళ్లు.. బాధితులను పరిచయమై వారిని ఈ ఉచ్చులోకి దించుతారు. తాము చేసేపనిలో మోసమేమీ లేదని నమ్మించడానికి వాళ్లు ఒక కస్టమర్ కేర్ ను కూడా నడుపుతున్నారు. వారి ద్వారా మాట్లాడించి బాధితుల సందేహాలు తీరిన తర్వాత తీరిగ్గా వారి దగ్గర్నుంచి ఉన్నదంతా ఊడ్చేస్తారు. తర్వాత వారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం.. మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోవడం సాధారణమే...’ అని ఇంటర్ పోల్ తెలిపింది.

  ఈ తరహా నేరాలు వ్యవస్థీకృత పద్దతిలో.. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి జరుగుతున్నాయని.. వీటి గురించి జాగ్రత్తగా ఉండాలని 194 దేశాలను ఇంటర్ పోల్ హెచ్చరించింది. అంతర్జాతీయంగా తమకు దీని మీద నివేదికలు అందాయని.. డేటింగ్ యాప్ ల పట్ల సందేహాస్పదంగా ఉండాలని హెచ్చరించింది. అనుమానాస్పద వ్యక్తుల నుంచి గానీ.. తెలియని వారి నుంచి గానీ ఇలాంటి కాల్స్, సందేశాలు వచ్చినప్పుడు పోలీసులకు విన్నవించడం బెటర్ అని సూచించింది. తక్కువ పెట్టుబడితో రాబడి రావడం అనే మాటలను అస్సలు నమ్మొద్దని తెలిపింది. డబ్బులు బదిలీ చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని.. లేకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించింది.
  Published by:Srinivas Munigala
  First published: