చిట్టీలు వేస్తున్నారా? చిట్ ఫండ్‌లో డబ్బులు కడుతున్నారా? అయితే జాగ్రత్త

మీరు బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే 7-9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అంతకంటే ఎక్కువ వడ్డీ ఎక్కడా సాధ్యం కాదు. మీకు అంతకంటే ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా, ఐదేళ్లలో రెట్టింపు డబ్బు ఇస్తామన్నా అనుమానించాల్సిందే.

news18-telugu
Updated: February 7, 2019, 5:55 PM IST
చిట్టీలు వేస్తున్నారా? చిట్ ఫండ్‌లో డబ్బులు కడుతున్నారా? అయితే జాగ్రత్త
చిట్టీలు వేస్తున్నారా? చిట్ ఫండ్‌లో డబ్బులు కడుతున్నారా? అయితే జాగ్రత్త
news18-telugu
Updated: February 7, 2019, 5:55 PM IST
పిల్లల చదువులకో, పెళ్లిళ్ల కోసమో డబ్బులు జమ చేసేందుకు చిట్టీలు వేయడం, చిట్ ఫండ్ కంపెనీల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం మధ్యతరగతి కుటుంబాల్లో మామూలే. అయితే అనధికారిక చిట్టీల వ్యవస్థ సమాజంలో పాతుకుపోయింది. ఏ ఊళ్లో చూసినా అనధికారికంగా చిట్టీల లావాదేవీలు నడిపేవాళ్లు కనిపిస్తారు. మోసాలు చేసేది కూడా అలాంటివాళ్లే ఎక్కువ. జనం నుంచి లక్షలు, కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం సర్దేసి పారిపోతుంటారు మోసగాళ్లు. వీళ్లే కాదు అధికారికంగా చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహించేవాళ్లు కూడా ఇలాగే దుకాణాలు ఎత్తేస్తుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో శారద చిట్ ఫండ్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెట్టుబడికి 34 రెట్లు ఇస్తామని ముంచేసిన ఘరానా మోసమది. మరి మీరు ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే ఏం చేయాలి? చిట్ ఫండ్ మోసాలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి.

Read this: మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

saradha chit fund case, saradha chit fund, saradha chit fund amount, saradha chit fund case in supreme court, saradha chit fund accused, sharda company, chit fund scam, శారద చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్స్ మోసాలుఆర్బీఐ, సెబీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా చిట్ ఫండ్ కంపెనీల వసూళ్లు


ఆర్‌బీఐ లేదా సెబీ అనుమతితోనే చిట్ ఫండ్ కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రోజువారీ వసూళ్లు చేయాలి. అది కూడా ముందే నిర్ణయించిన స్కీమ్ ప్రకారం, నిర్ణీత గడువు వరకే చేయాలి. ఇందుకోసం ఆర్‌బీఐ, సెబీ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ చాలావరకు కంపెనీలు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రజలను ఆకర్షించే పథకాలతో డబ్బులు వసూలు చేస్తుంటాయి. 5-7 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికంటే 10 రెట్లు డబ్బులు ఇస్తామని నమ్మిస్తాయి. ఏజెంట్లు ఊళ్లకు వెళ్లి మరీ వసూళ్లు చేస్తుంటారు. కానీ డబ్బులు తిరిగి ఇచ్చే గడువు వచ్చేసరికి పత్తా లేకుండా పోతారు. లేదా కొత్త ఇన్వెస్టర్ల దగ్గర వసూలు చేసిన డబ్బును పాత ఇన్వెస్టర్లకు సర్దుబాటు చేస్తూ కాలం గడుపుతారు. అయితే కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల రాక ఆగిపోయినప్పుడు దుకాణం ఎత్తేస్తారు.Read this: Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?

saradha chit fund case, saradha chit fund, saradha chit fund amount, saradha chit fund case in supreme court, saradha chit fund accused, sharda company, chit fund scam, శారద చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్స్ మోసాలు


చిట్ ఫండ్ కంపెనీలు ప్రజలకు వల వేసేది ఇలాగే...


చిట్ ఫండ్ కంపెనీ ముందుగా మంచి ఆకర్షణీయ పథకాన్ని రూపొందిస్తుంది. ఆ తర్వాత భారీ కమిషన్లు ఇస్తామంటూ ఏజెంట్లను నియమించుకుంటారు. ఏజెంట్లు తమ పరిచయస్తులను, కొత్త వారిని పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. మంచి లాభాలు ఉంటాయని ప్రలోభ పెడతారు. ఏజెంట్లు తమకు తెలిసినవారే కాబట్టి జనం నమ్మేస్తారు. పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత ఏజెంట్లు ఉద్యోగాలు మానేస్తారు. చిట్ ఫండ్ కంపెనీలు మూతపడతాయి. శారద చిట్ ఫండ్ స్కామ్‌లో అయితే ఏకంగా సినిమా తారలతో ప్రకటనలు ఇచ్చారు.

Read this: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

saradha chit fund case, saradha chit fund, saradha chit fund amount, saradha chit fund case in supreme court, saradha chit fund accused, sharda company, chit fund scam, శారద చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, చిట్ ఫండ్స్ మోసాలు


చిట్ ఫండ్ కంపెనీల మోసాలను ఎలా గుర్తించాలి?


మీరు బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే 7-9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అంతకంటే ఎక్కువ వడ్డీ ఎక్కడా సాధ్యం కాదు. మీకు అంతకంటే ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా, ఐదేళ్లలో రెట్టింపు డబ్బు ఇస్తామన్నా అనుమానించాల్సిందే. అది అసాధ్యమన్నది నిపుణుల మాట. కాబట్టి ఆ కంపెనీ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని ముంచేయడం ఖాయం. అసలు ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉందో లేదో తెలుసుకోవాలి. మీ దగ్గర ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకొని ఆ కంపెనీ ఏం చేస్తుందో గమనించాలి. ఏజెంట్లు చెప్పే మాయమాటల్ని నమ్మకూడదు. మోసం జరుగుతున్నట్టు అుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. లేదా సెబీకి చెందిన SCORES platform లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. మీరు మోసపోయినట్టైతే వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...