Best Smart TV deals: అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ ఫెస్టివల్​ సేల్స్​.. స్మార్ట్​టీవీలపై బంపర్ ఆఫర్లు.. బెస్ట్​ డీల్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

Smart TVs Deals: దేశంలో పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఈ–కామర్స్​ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్‌కార్ట్​లు పోటాపోటీగా ఫెస్టివల్​ సేల్​ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ ఫెస్టివల్​ సేల్స్​లో స్మార్ట్​టీవీలపై అందిస్తున్న బెస్ట్​ డీల్స్​పై ఓలుక్కేద్దాం.

  • Share this:
దేశంలో పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఈ–కామర్స్​ దిగ్గజాలు అమెజాన్ (Amazon)​, ఫ్లిప్‌కార్ట్​(Flipkart)లు పోటాపోటీగా ఫెస్టివల్​ సేల్​ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్స్​లో మునుపెన్నడూ లేని విధంగా బంపరాఫర్లు ప్రకటించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ (Smart Phones), స్మార్ట్‌వాచ్‌లు (Smart watches), హెడ్‌ఫోన్‌లు (Head phones), ల్యాప్‌టాప్‌లు (Laptops) ఇలా ప్రతి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్​పై భారీ డిస్కౌంట్​ అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లకు అదనంగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు లావాదేవీలపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ ఫెస్టివల్​ సేల్స్​లో స్మార్ట్​టీవీలపై అందిస్తున్న బెస్ట్​ డీల్స్​పై ఓలుక్కేద్దాం.

బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ UHD స్మార్ట్ టీవీ (The Blaupunkt Cybersound UHD Smart TV)

ఫెస్టివల్​ సేల్​లో బ్లాపంక్ట్ 43- అంగుళాలు, 55 అంగుళాల మోడల్స్​ను వరుసగా రూ .28,999,​ రూ .34,499 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు మోడల్స్​లో HDR10+, 50W/60W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్, ఎంఈఎంసీ టెక్నాలజీ, గూగుల్ ప్లే వంటి అట్రాక్టివ్​ ఫీచర్లను అందించింది. కంపెనీ ఇటీవల 65 -అంగుళాల మోడల్​ను రూ. 55,999 ధర వద్ద విడుదల చేసింది.

షియోమి రెడ్​మీ ఎక్స్​ 50, ఎక్స్​ 55 (The Xiaomi Redmi X50)

అమెజాన్ ఇండియాలో షియోమి రెడ్​మీ ఎక్స్ 50, ఎక్స్ 55 రెండు మోడళ్లు వరుసగా రూ .37,999, రూ .42,999 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. 65 అంగుళాల రెడ్‌మి ఎక్స్ 65 4 కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రూ .57,499 వద్ద లభిస్తుంది. వీటిలో డాల్బీ విజన్, ఇన్​బిల్ట్​ క్రోమ్​కాస్ట్​, హెచ్​డీఆర్​10+, డాల్బీ ఆడియో, 30W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.

TVS Jupiter 125: టీవీఎస్​ జూపిటర్​ 125 లాంచ్​.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతంటే..

శామ్సంగ్​ క్యూఎల్​ఈడీ 4K టీవీ (Samsung’s The Frame 2021 QLED 4K TV)

అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్​టీవీని కేవలం రూ .59,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ రూ .34,990 ధర వద్ద లభిస్తుంది. వీటిలో HDR, HDR10+, 40W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.

సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV  (Sony Bravia 4K Smart Android LED TV)

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్​ఈడీ టీవీని రూ .50,240 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 55 -అంగుళాల మోడల్​ రూ .70,740 ధర వద్ద లభిస్తుంది. 65- అంగుళాల మోడల్ రూ. 96,740 వద్ద అందుబాటులో ఉంటుంది. వీటిలో 4K HDR, వాయిస్ సెర్చ్, 4K X1 ప్రాసెసర్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించింది.

Amazon TV Stick: అమెజాన్ ఫైర్ స్టిక్ 4K మాక్స్ లాంచ్​.. మీ టీవీని స్మార్ట్​టీవీగా మార్చండి

వన్​ప్లస్4K ఎల్​ఈడీ ఆండ్రాయిడ్ టీవీ (OnePlus 4k LED android tv)

​వన్​ప్లస్​ తన బడ్జెట్ Y సిరీస్, U సిరీస్ స్మార్ట్​టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 50- అంగుళాల వన్​ప్లస్​ U సిరీస్ 4K LED ఆండ్రాయిడ్ TV మోడల్​ను రూ. 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 65-అంగుళాల మోడల్​ రూ. 66,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

టీసీఎల్​ ఏఐ 4K UHD ఆండ్రాయిడ్​ స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీ (TCL AI 4K UHD Android Smart LED TV)

టీసీఎల్ ఎల్​ఈడీ, క్యూఎల్​ఈడీ లైనప్‌లోని స్మార్ట్​టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 50 అంగుళాల టీసీఎల్​ ఏఐ 4K యూహెచ్​డీ ఆండ్రాయిడ్​ స్మార్ట్​టీవీ కేవలం రూ .34,999 ధర వద్ద లభిస్తుంది. 55 -అంగుళాల మోడల్​ను ​ రూ .41,999 వద్ద, 55 -అంగుళాల మోడల్​ రూ.59,999 వద్ద, 55 -అంగుళాల ప్రీమియం మోడల్​ను రూ .1,05,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా ? 10వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే

హిసెన్స్ 4K UHD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ (The Hisense 4K UHD Smart LED TV )

43 -అంగుళాల హిసెన్స్ 4K UHD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ రూ .29,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. 50 -అంగుళాల హిసెన్స్ టోర్నడో టీవీ రూ. 42,499 ధర వద్ద లభిస్తుంది. వీటిలో డాల్బి విజన్​, డాల్బి అట్మాస్​, జేబీఎల్​ స్పీకర్లను అందించింది.

HDFC Bank: తక్కువ వడ్డీకే రూ.75 లక్షల వరకు రుణం.. హెచ్‌డీఎఫ్‌సీ పండుగ ఆఫర్లు

వీయూ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ (VU 4K Ultra HD Smart TV)

ఫ్లిప్‌కార్ట్‌లో 55 అంగుళాల VU 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ రూ.38,999 ధర వద్ద అందుబాటులో ఉంది. దీనిలో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.

Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా?

ఎల్​జీ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ (LG 4K Ultra HD Smart LED TV)

అమెజాన్ ఫెస్టివల్​ సేల్​లో 43 అంగుళాల ఎల్​జీ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీని రూ .32,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఏఐ థింక్యూ, 4కె అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లను జోడించింది.

టీఎల్​సీ ఫుల్ HD LED స్మార్ట్ టీవీ (TLC iFFALCON)

ఫ్లిప్​కార్ట్​లో టీఎల్​సీ iFFALCON తన 43-అంగుళాల ఫుల్ హెచ్​డీ ఎల్​ఈడీ స్మార్ట్ టీవీని రూ. 21,999 ధర వద్ద అందిస్తోంది. ఇక, 55 -అంగుళాల 4K LED ఆండ్రాయిడ్ టీవీని రూ. 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published: