Mercedes Benz: బెంజ్ కారు కొనడం మీ కలా...అతి తక్కువ ధరకే కొనుగోలు చేయండిలా ?

ప్రతీకాత్మకచిత్రం

పాత కారును ఎక్స్చేంజి చేసి కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో, అలాంటి వాటిలో మంచి లగ్జరీ కార్లు అయిన, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా ఉంటాయి. ఇలాంటి వాటికి పూర్తి సర్వీసింగ్ తో పాటు, నిపుణుల సర్టిఫికేషన్ తో ఈ కంపెనీలు విక్రయిస్తున్నాయి.

  • Share this:
    బెంజ్ కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల, స్టేటస్ సింబల్ కు బెంజ్ ఒక ప్రతీక, అయితే సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్టులు మాత్రమే వాడే బెంజ్ కారును ఇప్పుడిప్పుడే అప్పర్ మిడిల్ క్లాస్ వర్గం కూడా కొనుగోలు చేస్తోంది. అయితే మీరు కొత్త బెంజ్ కారు కొనాలంటే మాత్రం కోటి నుంచి రూ.50 లక్షల దాకా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అయితే కొత్త బెంజ్ కారు బదులు, మంచి మెయిన్ టెయినన్స్, అలాగే సర్వీసింగ్ తో తక్కువ కిలోమీటర్లు తిరిగిన బెంజ్ కార్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయడం కూడా చాలా తక్కువ ఖర్చుతో వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే కంపెనీల్లో, కొన్ని కొత్తకార్లను విక్రయించే సంస్థలు కూడా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ ఔన్డ్ కార్ల వ్యాపారాన్ని మారుతి లాంటి సంస్థలు కూడా నిర్వహిస్తున్నాయి. పాత కారును ఎక్స్చేంజి చేసి కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో, అలాంటి వాటిలో మంచి లగ్జరీ కార్లు అయిన, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా ఉంటాయి. ఇలాంటి వాటికి పూర్తి సర్వీసింగ్ తో పాటు, నిపుణుల సర్టిఫికేషన్ తో ఈ కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఈ కార్లకు కొంత కాలం పాటు గ్యారంటీ ఇవ్వడంతో పాటు ఉచిత సర్వీసింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి వీటి ద్వారా కార్లను కొనుగోలు చేయవచ్చు.



    క్వికర్ డాట్ కామ్, జిగ్ వీల్స్ డాట్ కామ్, ఆటో పోర్టల్ డాట్ కామ్, కార్ వాలే డాట్ కామ్, కార్ దేఖో డాట్ కామ్, కార్స్ 24 డాట్ కామ్, కార్ ట్రేడ్ వంటి వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మన బడ్జెట్ కు తగిన విధంగా ఉండే కారును కొనుగోలు చేయవచ్చు.
    Published by:Krishna Adithya
    First published: