హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment: డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా..? రూ.2 లక్షలతో భారీగా ప్లాన్ చేయండి.. ఇదిగో ఇలా ఫాలో అయితే చాలు..!

Investment: డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా..? రూ.2 లక్షలతో భారీగా ప్లాన్ చేయండి.. ఇదిగో ఇలా ఫాలో అయితే చాలు..!

డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా..?

డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా..?

పెట్టుబడి పెట్టడానికి నగదు ఉండి.. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక చాలా మంది ఆందోళన పడుతుంటారు. సురక్షితమైన రాబడి పొందే మార్గాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం.. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ను నిపుణుల సాయంతో అందిస్తోంది CNBC-TV18.com.

ఇంకా చదవండి ...

పెట్టుబడి పెట్టడానికి నగదు ఉండి.. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక చాలా మంది ఆందోళన పడుతుంటారు. సురక్షితమైన రాబడి పొందే మార్గాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం.. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ను నిపుణుల సాయంతో అందిస్తోంది CNBC-TV18.com. పెట్టుబడి పెట్టడానికి రూ.2 లక్షలు ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు.

* ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం మంచిదంటున్నారు రెనైస్సేన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్‌, డైరెక్టర్, పవన్ పరాఖ్. ‘వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని కవర్ చేయడానికి సరిపోవు. ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్‌తో, రియల్ ఎస్టేట్‌లోకి ప్రవహించే గణనీయమైన మొత్తంలో డబ్బు ఇప్పుడు ఉండదు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రధానంగా వినియోగదారుల నుంచి డిమాండ్‌ను ఆకర్షిస్తుంది, పెట్టుబడిదారుల నుంచి కాదు. భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇది ఈక్విటీలో పెట్టుబడులను మరింత బలంగా మారుస్తుంది.’ అని సలహా ఇచ్చారు. అయితే డెట్ వంటి అసెట్ క్లాస్‌ల కంటే ఈక్విటీకి ఎక్కువ నష్టాలు ఉన్నాయనే వాస్తవాన్ని పెట్టుబడిదారులు తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఇదీ చదవండి:  ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


* ఎలా అలొకేట్‌ చేసుకోవాలి?

మోడరేట్‌/హై -రిస్క్ తీసుకొనే వారైతే.. ఈక్విటీలకు ఎక్కువ మొత్తం కేటాయించాలని పవన్‌ పరాఖ్‌ తెలిపారు. తక్కువ-రిస్క్ తీసుకోవాలని భావించే ఇన్వెస్టర్ అయితే.. ఈక్విటీలకు 30-40 శాతం ఎక్స్పోజర్, మిగిలిన మొత్తం డెట్ వైపు పెట్టవచ్చని చెప్పారు. ఈక్విటీలలో, లార్జ్ క్యాప్‌ల వైపు కేటాయింపులు ఎక్కువగా ఉండాలని, మరీ ముఖ్యంగా నాణ్యమైన స్టాక్‌లు/మ్యూచువల్ ఫండ్స్‌గా ఉండాలని పరాఖ్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు గుడ్డిగా రాబడిని వెంబడించకూడదు, రిస్క్ ఫ్రేమ్‌వర్క్‌లు లేనప్పుడు, ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలు భారీ డ్రాడౌన్‌లను చూడవచ్చు, ఇది ఆర్థిక, ఎమోషనల్‌ డ్యామేజ్‌ను కలిగిస్తుందని ఆయన వివరించారు.

* మ్యూచువల్ ఫండ్స్

పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని కూడా పరిగణించవచ్చు, ఎందుకంటే అవి క్రమరహిత నష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. వ్యక్తిగత స్టాక్‌లు క్రమరహిత, క్రమబద్ధమైన నష్టాలను కలిగి ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్‌లు క్రమబద్ధమైన రిస్క్ లేదా మార్కెట్ రిస్క్‌కు మాత్రమే లోబడి ఉంటాయి.

* ఇతర ఇన్వెస్ట్‌మెంట్ఆప్షన్‌లు

స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీకి కొంత ఎక్స్పోజర్‌తో పాటు తక్కువ-రిస్క్, తక్కువ-రాబడి ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న వారు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ఆప్షన్‌లను పరిశీలించాలని గ్రిప్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అగర్వాల్ చెప్పారు. అవి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు విలువను జోడిస్తాయని, ఇవి స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులకు నేరుగా లింక్ కావని నిఖిల్‌ వివరించారు. అటువంటి పోర్ట్‌ఫోలియోను నిర్మించడానికి అసెట్ లీజింగ్, ఇన్వెంటరీ ఫైనాన్స్, స్టార్టప్ ఈక్విటీ, కమర్షియల్ రియల్ ఎస్టేట్ వంటి వాటిని చేర్చాలని సూచించారు. ఇవి మధ్యంతర, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం రాబడిని సంపాదించడంలో సహాయపడుతుందని సూచించారు.

First published:

Tags: Earning money, Equity fund, Investments, Mutual Funds

ఉత్తమ కథలు