హోమ్ /వార్తలు /బిజినెస్ /

Best Health Insurance Plans: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? టాప్ 5 పాలసీలు ఇవే..!

Best Health Insurance Plans: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? టాప్ 5 పాలసీలు ఇవే..!

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే..!

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే..!

ప్రస్తుతం వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్ అవసరంగా మారింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అధిక వైద్య ఛార్జీలు, ఆసుపత్రిలో చేరే ఖర్చులు, ప్రీ-మెడికల్, పోస్ట్‌ వైద్య ఖర్చుల నుంచి రక్షణ అందిస్త

ఇంకా చదవండి ...

కొవిడ్‌ తర్వాత భారతదేశంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్ అవసరంగా మారింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అధిక వైద్య ఛార్జీలు, ఆసుపత్రిలో చేరే ఖర్చులు, ప్రీ-మెడికల్, పోస్ట్‌ వైద్య ఖర్చుల నుంచి రక్షణ అందిస్తాయి.

అయితే, ఏదైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను సెలక్ట్‌ చేసుకునే ముందు అందులో.. ఏ ఖర్చులను కవర్‌ చేస్తున్నారు, వేటిని మినహాయిస్తున్నారు, నిబంధనలు, ఫీచర్లు వంటివి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల గురించి తెలుసుకోండి.

* ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాటినం ప్లాన్

ఈ బీమా పాలసీ రూ.2 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. దీని నెట్‌వర్క్‌లో 10,000 ప్లస్ హాస్పిటల్స్ ఉన్నాయి.ఇది 60 రోజుల ముందు, 180 పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది. పాలసీ మొదటి రోజు నుంచి మధుమేహం, ఆస్తమా, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను కవర్ చేస్తుంది. ఇది పరీక్షలు, సంప్రదింపులు, ఔషధాలకు సంబంధించిన ఖర్చులను కూడా అందిస్తుంది. అనారోగ్యం, ఊబకాయం చికిత్స, హోమ్‌ ట్రీట్‌మెంట్‌ కవర్ చేస్తుంది. పాలసీకి రూ.1,000 ఔట్ పేషెంట్ విభాగం (OPD) కవరేజీ ఉంది (రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్‌ అందుబాటులో ఉంటుంది).

ఇదీ చదవండి: క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ పని చేయడం లేదా.. ? డోంట్ వర్రీ. ఇలా చేస్తే చాలు.. మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ?


* స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ పాలసీ

పాలసీ కవర్ రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షలు ఉంది. 12,000పైగా నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ ఉన్నాయి.ఈ పాలసీ ప్రత్యేకంగా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. పాలసీలో ఒకటి, రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితి ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ టెస్ట్ అవసరం. రూ.25 లక్షల వరకు విస్తృత కవరేజీ అందుతుంది. ఇది డే కేర్ విధానాలు, శస్త్రచికిత్సలు, డీప్‌ బ్రైన్‌ స్టిములేషన్‌, ఆధునిక చికిత్సలు, రోబోటిక్ సర్జరీలు, ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు, బ్రోన్చియల్ థర్మోప్లాస్టీ వంటి వాటికి కూడా కవరేజీని ఇస్తుంది. పాలసీ రెండవ సంవత్సరం నుంచి ముందుగా ఉన్న అనారోగ్యాలను కవర్ చేస్తుంది.

* ఐసీఐసీఐ లాంబార్డ్ కంప్లీట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ

పాలసీ కవర్ రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షలు. 6,500పైగా నెట్‌వర్క్‌ హాస్పిటల్‌లు ఉన్నాయి. ఇది పాలసీ ప్రారంభ తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది (రూ.3 లక్షలు, అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్‌ అందుబాటులో ఉంటుంది). పాలసీదారులకు 45 ఏళ్ల వరకు కో-పే లేదా ప్రీ-మెడికల్ చెక్-అప్ అవసరం లేదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కోసం ప్రతి సంవత్సరం రెండు కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ కూపన్‌లు అందుతాయి.

* స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా

పాలసీ కవర్ రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షలు ఉంది. దీని నెట్‌వర్క్ హాస్పిటల్స్ 12,000 పైగా ఉన్నాయి. పాలసీదారు ప్రమాదానికి గురైతే (యాడ్-ఆన్‌లకు లోబడి) బీమా చేసిన మొత్తం ఆటోమేటిక్‌గా 25 శాతం (రూ.5 లక్షల వరకు) పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారు ప్లాన్‌ను పునరుద్ధరించడంలో విఫలమైతే, దానిని పునరుద్ధరించడానికి వారికి 120 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇది గది ఛార్జీలు, మందులతో సహా ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. అలాగే, బీమా మొత్తంలో 10 శాతం అత్యవసర అంబులెన్స్ ఛార్జీలు, ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు వంటి ఖర్చుల కోసం కేటాయిస్తారు. ఇది 60 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 90 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది రూ.1 లక్ష వరకు అవయవ మార్పిడి ఖర్చులను కవర్ చేస్తుంది.

* HDFC ERGO హెల్త్‌ సురక్ష

ఈ పాలసీ రూ.3 లక్షల నుండి రూ.10 లక్షలు వరకు కవర్‌ అందిస్తుంది. నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ 13,000 పైగా ఉన్నాయి. పాలసీ డే కేర్, ఆయుష్ చికిత్స, అవయవ దానం ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్య సంరక్షణ, ఎయిర్ అంబులెన్స్ ఖర్చులతో పాటు ప్రసూతి ప్రయోజనాలను, నవజాత శిశువు కవర్‌ను అందిస్తుంది. 60 రోజులకు ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు, 90 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను అందిస్తుంది.

First published:

Tags: Health, Health Insurance, Health policy, Insurance

ఉత్తమ కథలు