Best Gift: ఈక్విటీ ఇండెక్స్ ఫండ్, గోల్డ్​, ఫిక్స్డ్ డిపాజిట్​.. వీటిలో మీ పిల్లలకు దేన్ని గిఫ్ట్‌గా ఇస్తే మంచిది​?.. తెల?

(ప్రతీకాత్మక చిత్రం)

నగదు, కారు, బంగారం లేదా గృహోపకరణాలు వంటి ఇతర ఆస్తులను బహుమతిగా ఇవ్వడం కంటే వారి కోసం కార్పస్ క్రియేట్​ చేసే పెట్టుబడిని ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక. వాటిలో ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు​. ఫిక్స్​డ్​ డిపాజిట్​, సాంప్రదాయ బీమా పాలసీలతో పోలిస్తే ఇది అధిక రాబడిని ఇస్తుంది.

  • Share this:
భారతీయులు డబ్బు పొదుపు చేయడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. తాము సంపాదించే నెలవారీ జీతంలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెడుతుంటారు. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, హాస్పిటల్​ ఖర్చులు వంటి వాటిని ఈ పొదుపును వినియోగిస్తుంటారు. అందుకే మన దగ్గర ఫిక్స్​డ్​ డిపాజిట్లు, టర్మ్​ డిపాజిట్లు, సాంప్రదాయ బీమా పాలసీలు ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మలి వయస్సులో తమ మనుమలు, మనుమరాళ్లకు కొన్ని గిఫ్ట్స్​ ఇస్తుంటారు. అయితే నగదు, కారు, బంగారం లేదా గృహోపకరణాలు వంటి ఇతర ఆస్తులను బహుమతిగా ఇవ్వడం కంటే వారి కోసం కార్పస్ క్రియేట్​ చేసే పెట్టుబడిని ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక. వాటిలో ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు​. ఫిక్స్​డ్​ డిపాజిట్​, సాంప్రదాయ బీమా పాలసీలతో పోలిస్తే ఇది అధిక రాబడిని ఇస్తుంది.

Bitcoin: అప్పుడు అకౌంట్‌లో మర్చిపోయిన బిట్‌కాయిన్ల విలువ ఇప్పుడు రూ.216 కోట్లు


ఉదాహరణతో చూద్దాం..

ఈక్విటీ ఇండెక్స్​ ఫండ్స్​లో రాబడి మార్కెట్​ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే కాస్త రిస్క్​ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే దీర్ఘకాలంలో అధిక రాబడి పొందవచ్చు. 1979 ఏప్రిల్​లో సెన్సెక్స్ ప్రారంభించినప్పుడు మార్కెట్​ విలువ 100 బేసిస్ పాయింట్లు ఉండగా.. అది ఇప్పుడు 55,500+ బేసిస్ పాయింట్లకు పెరిగింది. అంటే 1979లో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఊహించని లాభం వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. 1979లో కేవలం రూ.10,000లతో ఇండెక్స్ ప్రారంభిస్తే.. ఇప్పుడు అది సుమారుగా రూ. 1.04 కోట్లకు చేరుకేనేది. అంటే, మీరు ఈక్విటీ ఇండెక్స్​ ఫండ్​లో పెట్టుబడి పెట్టకపోవడం వల్ల ఎంత కోల్పోయారో ఊహించవచ్చు.

వాస్తవానికి, మీరు గత 10 సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే, నిఫ్టీ 12.44 శాతం భారీ రాబడిని ఇచ్చింది. మరోవైపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కేవలం 7.30 శాతం రాబడిని ఇచ్చాయి. అంటే, బంగారం, ఫిక్స్​డ్​ డిపాజిట్ల కంటే ఈక్విటీ ఫండ్లు ఎంత లాభదాయకమే ఈ గణాంకాలే చెబుతున్నాయి.

Business Idea: క్రికెట్ బాల్ బిజినెస్‌...5 లక్షల పెట్టుబడితో నెలకు 2 లక్షల సంపాదన..ఇలా...


దీర్ఘకాలిక పెట్టుబడే ఎందుకు ఉత్తమం?

అనుభవం లేని పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే మార్కెట్​ పరిస్థితులపై అంచనాకు వచ్చే వరకు పెద్ద మొత్తంలో స్టాక్‌లను కొనడం, అమ్మడం వంటి చేయకూడదు. ట్రెండింగ్​ను అవగాహన చేసుకుంటూ క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లాలి. ఇదే విషయాన్ని లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కూడా చెప్పారు. ‘‘ఇండెక్స్ ఫండ్‌లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టడం ద్వారా, అనుభవం లేని వారు సైతం ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ కంటే అధిక లాభాలను ఆర్జించగలరు.” అని పేర్కొన్నారు.

ఇండెక్స్​ ఫండ్​లో పెట్టుబడితో ప్రయోజనాలు

సింపుల్​ స్ట్రాటజీ

విస్తృతమైన పరిశోధన అవసరమయ్యే ఫండ్స్​తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా సులభం. అంతేకాదు, వీటిని అర్థం చేసుకోవడం, మార్కెట్​ ట్రెండ్​ను ట్రాక్ చేయడం కూడా సులభం.

నామినల్​ ఫీజు

సకాలంలో కొనుగోలు/అమ్మకాలను నిర్ణయించడానికి స్టాక్స్​ను నిరంతరం ట్రాక్​ చేయడం సులువయ్యే పని కాదు. అదే, ఇండెక్స్ ఫండ్ విషయంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే పదే పదే చూసుకోవాల్సిన పనిలేదు. అందువల్ల, ఇండెక్స్​ ఫండ్​ నిర్వహణకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

ట్రాన్ఫరెన్సీ

ఈక్విటీ ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి ద్వారా మీ డబ్బు పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది ఎప్పటికప్పుడు ట్రాక్​ చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రయోజనంగా చెప్పవచ్చు. అంతేకాదు, మీ డబ్బును నిర్వహించేందుకు థర్డ్​ పార్టీల ప్రమేయం ఉండదు. మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది.

టాక్స్​ తక్కువ

ఈక్విటీ ఇండెక్స్​ ఫండ్లలో స్వల్పకాలికంగా పెట్టుబడి పెడితే కొనుగోలు, అమ్మకం ద్వారా మీ మూలధన లాభాలు తగ్గే అవకాశం ఉంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడి బెస్ట్ ఆప్షన్​. ఆకస్మిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లాభాల కోసం వేచి చూడండి.

డైవర్సిఫికేషన్​

మిగతా వాటితో పోలిస్తే ఇండెక్స్ ఫండ్ విభిన్నంగా ఉంటుంది. దీనిలో ఎక్కువ కాలం ఎంచుకుంటాం కాబట్టి మీ పెట్టుబడికి భరోసా ఉంటుంది. అందుకే వారెన్ బఫెట్ వంటి దిగ్గజ పెట్టుబడిదారులు కూడా ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు.

పెట్టుబడికి ముందు పరిశీలించాల్సిన అంశాలివే..

అన్ని ఇండెక్స్ ఫండ్‌లు ఒకే రకమైన లాభాలు అందించవు. అందుకే నిర్దిష్ట ఇండెక్స్ ఫండ్‌ని ఎంచుకునే క్రమంలో చాలా మంది కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటారు. ఇండెక్స్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు మీరు 4 కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. కేటగిరీ ఇండెక్స్ పీర్‌ల మధ్య పోల్చుకొని దానికి అనుగుణంగా ఈక్విటీ ఇండెక్స్ ఫండ్​ను ఎంచుకోండి. వీటితో పాటు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

AUM సైజ్ ఫండ్

అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) అనేది ఒక ఫండ్​ మేజేజర్​. ఇది ఫండ్‌పై పెట్టుబడిదారుల విశ్వాస స్థాయిని సూచిస్తుంది. అందువల్ల, దీర్ఘకాలంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడమే మంచిది.

ఎక్స్​పెన్స్​ రేషియో

ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వాటి వ్యయ నిష్పత్తి ఆధారంగా ఈ రుసుము ఉంటుంది. అందుకే తక్కువ రుసుము గల ఫండ్‌తో వెళ్లాలి.

ట్రాకింగ్ ఎర్రర్

ఇండెక్స్​ ఫండ్ల నుంచి రాబడులతో పోలిస్తే సాధారణ ఫండ్ల నుంచి వచ్చే రాబడుల్లో ట్రాకింగ్​ ఎర్రర్​ ఎక్కువగా ఉంటుంది. ఇది వాస్తవానికి సున్నాగా ఉండాలి కానీ 1-2 శాతం వ్యత్యాసం ఉంటుంది.

పెట్టుబడి కాలం

ఇండెక్స్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు ఫండ్ మార్కెట్లో ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత మంచిది. సుదీర్ఘ కాల వ్యవధిలో అనగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఈక్విటీ ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు.
Published by:Krishna Adithya
First published: