Home /News /business /

BEST DEAL ON NEW YEAR BRING HOME FLOUR AND MUSTARD OIL FOR 1 RUPEE RAISINS ARE AVAILABLE FOR 19 RUPEES MK

FlipKart: కేవలం 1 రూపాయికే ఫ్లిప్‌కార్ట్‌లో నెయ్యి, చక్కెరను బుక్ చేసి...మీ ఇంటికి తెప్పించుకోవచ్చు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

జనవరి 1, 2022న మీరు గ్రాసరీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1 నుంచి రూ. 19కి కిరాణా వస్తువులను ఇంటికి ఆర్డర్ చేసి మరీ తెచ్చుకోవచ్చు.

    ఈ కామర్స్ సైట్ల ద్వారా గ్రాసరీ వస్తువుల కొనుగోలు చేయడం అనేది చాలా కామన్ విషయంగా మారిపోయింది. ప్రస్తుతం పాండెమిక్ నేపథ్యంలో షాపింగ్ కు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో అటు దేశంలోని అగ్రశ్రేణి ఆ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు కూడా పాంట్రీ సర్వీసులను స్టార్ట్ చేశాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ సంస్థ కిరాణాకు చెందిన  వివిధ వస్తువులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా  మీరు కిరాణా షాపింగ్ చేస్తే, ఫ్లిప్‌కార్ట్ నుండి భారీ తగ్గింపులు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి 1, 2022న మీరు గ్రాసరీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1 నుంచి రూ. 19కి కిరాణా వస్తువులను ఇంటికి ఆర్డర్ చేసి మరీ తెచ్చుకోవచ్చు.

    ఫ్లిప్‌కార్ట్‌లో 'గ్రాసరీ' విభాగం ఉంది. ఇక్కడ ప్రతిరోజు రూ. 1 , రూ. 19 డీల్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు, కిరాణా డీల్స్‌పై కూడా బ్యాంక్ ఆఫర్‌లు అందిస్తున్నారు. రూ. 1 నుంచి రూ. 19 డీల్‌ల గురించి  పూర్తి వివరాలు తెలుసుకుండటే, ఈ విభాగంలో వివిధ రోజులలో వివిధ రకాల ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. జాబితాలో, గోధుమరవ్వ, కాబూలీ శనగలు, దేశీ నెయ్యి, చక్కెర వంటి వస్తువులు కూడా వినియోగదారులకు కేవలం 1 రూపాయికి అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ప్లాట్‌ఫారమ్‌లో రూ.19కి అనేక వస్తువులను కూడా అందిస్తున్నారు. ఈ రోజు (జనవరి 1) ఏ డీల్‌పై ఇంటికి ఏ వస్తువులు తీసుకురావచ్చో తెలుసుకుందాం.

    Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాంకేతిక సమస్యలు.. ఆ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు..


    1 రూపాయికి పిండి , ఆవాల నూనె

    మొదటి ఒక రూపాయికి లభించే వస్తువల గురించి తెలుసుకుందాం. కస్టమర్లకు 1 రూపాయికే ఒక కిలో పిల్స్‌బరీ గోధుమ పిండి అందుబాటులో ఉంచారు. ఇది మాత్రమే కాదు, 500ml ధార ఆవాల నూనె కూడా ఇక్కడ నుండి 1 రూపాయికి కొనుగోలు చేయవచ్చు.

    అదే సమయంలో, నేటి రూ. 19 డీల్‌లో వినియోగదారులకు 75 గ్రాముల మధుబన్ ప్రీమియం సీడ్‌లెస్ రైసిన్‌లను కూడా అందజేస్తున్నారు. ఇది కాకుండా, 100గ్రా ప్రియాగోల్డ్ ఇటాలియన్ క్రంచీ కుకీలను రూ.19కి ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకునే వీలుంది.

    Smart Watch: ఇలాంటి Smart Watch మీరెప్పుడు చూసి ఉండరు.. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. అదిరిపోయే ఫీచర్లు..

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు