Child Investment Plans: పిల్లల కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? ఈ మార్గాలు ఎంచుకోండి

Child Investment Plans: మారుతున్న పరిస్థితులు కుటుంబాల ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో చాలామంది తమ పిల్లల చదువులు, పొదుపు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌కు కేటాయించే మొత్తాన్ని తగ్గిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చేసే పొదుపు, పెట్టుబడులతో భవిష్యత్తులో వారికి ఆర్థిక భరోసా కలిగిస్తాయి.

news18-telugu
Updated: October 22, 2020, 4:09 PM IST
Child Investment Plans: పిల్లల కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? ఈ మార్గాలు ఎంచుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మారుతున్న పరిస్థితులు కుటుంబాల ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో చాలామంది తమ పిల్లల చదువులు, పొదుపు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌కు కేటాయించే మొత్తాన్ని తగ్గిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చేసే పొదుపు, పెట్టుబడులతో భవిష్యత్తులో వారికి ఆర్థిక భరోసా కలిగిస్తాయి. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫండ్ హౌస్‌లు అందించే చైల్డ్ సేవింగ్స్ ప్లాన్లకు ఆధరణ ఉంది. ఇవి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి, కానీ తక్కువ రాబడిని ఇస్తాయి. భవిష్యత్తులో పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి, వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి అందుబాటులో ఉన్న ఐదు ముఖ్యమైన చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ ప్లాన్స్ మీకోసం...

పబ్లిక్ ప్రొవిడెండ్ ఫండ్..

ఇది 15 సంవత్సరాల వ్యవధి ఉండే పథకం. పీపీఎఫ్‌లో పిల్లల చదువుల కోసం కార్పస్ ఫండ్‌ను తయారుచేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం ఎనిమిది శాతం వడ్డీ రేటు ఉంది. వివిధ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు 7.5 శాతం వరకే ఉన్నాయి. పీపీఎఫ్‌ అందించే వడ్డీ రేట్లను వచ్చే త్రైమాసికం నుంచి రిజర్వ్‌ బ్యాంక్ పెంచే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా అందే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సెక్షన్ 80 సి ప్రకారం రూ .1.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ కూడా పొందవచ్చు. పీపీఎఫ్‌ను 15 సంవత్సరాలకు మించి పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల గడువు నిబంధనతో ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్‌ అకౌంట్ మూసివేసే వరకు కార్పస్ పై వడ్డీ సంపాదించవచ్చు.

ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్:
ఇది నాన్ పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్‌ కుటుంబానికి రెట్టింపు రక్షణను అందిస్తుంది. దీంట్లో పాలసీదారుడు చేసే బేసిక్ పేమెంట్‌కు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ప్రీమియం లేదా ఇంటిగ్రేటెడ్ విత్‌డ్రా తరువాత కూడా పాలసీని కొనసాగించవచ్చు. ఈ ప్లాన్‌తో మార్కెట్ రిలేటెడ్ రెంట్, ఇన్సూరెన్స్ వంటి రెండు లాభాలున్నాయి. దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. పాలసీకి కనీస వయస్సు పరిమితి లేదు. 17 సంవత్సరాలు వచ్చే వరకు స్మార్ట్ స్కాలర్ ప్లాన్ తీసుకోవచ్చు. అనుకోకుండా పాలసీదారుడు చనిపోతే, బీమా చేసిన మొత్తానికి సమానమైన లంప్‌సమ్‌ అమౌంట్ లేదా చనిపోయిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలపై 105 శాతాన్ని అందిస్తారు.

ఎస్బీఐ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్..
ఇది మీ పిల్లల భవిష్యత్తుకు, విద్య అవసరాలకు భరోసా కల్పిస్తుంది. స్మార్ట్ ఛాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో వ్యక్తిగత జీవిత బీమా కూడా లభిస్తుంది. పాలసీ వ్యవధిలో మనకు అవసరమయ్యే ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిచడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనుకోని ప్రమాదాల వల్ల చనిపోయినా లేదా శాశ్వత వైకల్యం బారిన పడినా ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తరువాత నాలుగు సమాన వాయిదాలలో స్మార్ట్ ప్రయోజనాలు చెల్లిస్తారు.



సుకన్య సంవృద్ధి యోజన..

ఆడ పిల్లల చదువుల కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. సుకన్య సమృద్ధి యోజన కింద మీ పిల్లల చదువులు, పెళ్లి కోసం ఒక కార్పస్‌ ఫండ్‌ను తయారుచేసుకోవచ్చు. ఈ పథకంలో 8.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. దీనిపై కూడా సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ దీనికి లాక్‌ ఇన్‌ పీరియడ్ ఉంటుంది. ఈ పథకంలో నిర్ణీత వడ్డీ రేట్లు కొనసాగవు. ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను సమీక్షించవచ్చు. అయినా బ్యాంకులు అందించే వడ్డీ రేట్లకంటే సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే వడ్డీ రేటు ఎక్కువ. కొన్నిసార్లు వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచే అవకాశం కూడా ఉంది.

గోల్డ్ సేవింగ్..
గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా మీ పిల్లల కోసం బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ కార్పస్ ఫండ్‌ను జమ చేయవచ్చు. ఆస్తులతో పోలిస్తే బంగారంపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాల హోల్డింగ్ పీరియడ్‌ను ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లను అమ్మే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. గోల్డ్ సేవింగ్స్‌లో జ్యువెలరీ స్కీమ్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఆడపిల్లలకు ఆభరణాలు కొనడానికి ఇవి ఉపయోగపడతాయి. బంగారం ధరల తగ్గుదల వల్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.31 వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వడ్డీ రేట్లు, బంగారం ధరలు తగ్గడం వల్ల ఇది కూడా తగ్గింది. కానీ దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని ఇస్తాయి.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading