హోమ్ /వార్తలు /బిజినెస్ /

Best Cars Under Rs.5 Lakhs: ఇండియాలో రూ.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే..! వాటిపై ఓ లుక్కేయండి..

Best Cars Under Rs.5 Lakhs: ఇండియాలో రూ.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే..! వాటిపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు రూ.5 లక్షల బడ్జెట్‌లో కొత్త కారును కొనాలని అనుకొంటుంటే.. వీటిని పరిశీలించండి..

ఇండియాలో(India) అన్ని వర్గాల వారికి అవసరమైన కార్లు(Cars) అందుబాటులో ఉంటాయి. నచ్చిన ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో కూడా కార్లు అందుబాటులో ఉంటాయి. అయితే కారు కావాలని నిర్ణయించుకున్నప్పుడు అందుబాటులో ఉన్న వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం అంటే కష్టమైన పనే. అదే బడ్జెట్‌లో(Budget) కొనాల్సి వస్తే నచ్చిన కారును ఎంచుకోవడం ఇంకొంచెం క్లిష్టంగా మారుతుంది. అయితే ఇండియాలో కారు కొనేందుకు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భారత ఆటో మార్కెట్ మీ(Auto Market) అవసరాలను తీర్చే, సరసమైన ధరల లభించే కార్లను అందిస్తుంది. మీరు రూ.5 లక్షల బడ్జెట్‌లో(Budget) కొత్త కారును(New Car) కొనాలని అనుకొంటుంటే.. వీటిని పరిశీలించండి..

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro)

హ్యుందాయ్ తన ప్రసిద్ధ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రోని 2018లో సరికొత్త రూపంలో తిరిగి తీసుకువచ్చింది. ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రూ.4.86 లక్షలు గా ఉంది. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ 5 మంది ప్రయాణికులకు మంచి క్యాబిన్ స్పేస్‌తో పాటు స్టైలిష్ రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 68.05 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ 20.3 కిమీ/లీటర్ మైలేజీని అందజేస్తుందని పేర్కొంది. ఇది రోజువారీ అవసరాలకు నగరాల్లో ప్రయాణించేందుకు చక్కగా సరిపోతుంది.

Money Saving Tips: నెలకు రూ.1,000 పొదుపు చేసినా కోటీశ్వరులు కావొచ్చు ఇలా

* రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

రెనాల్ట్ క్విడ్ బేస్ RXL వేరియంట్ రూ.4.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. రూ.5 లక్షల లోపు ధరకు రెండు పెట్రోల్ ఇంజిన్‌ వేరియంట్‌లలో కూడా లభిస్తుంది. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ 53.26 bhp ఉత్పత్తి చేసే 799 cc 3 సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 1 లీటర్ యూనిట్ 5500 rpm వద్ద 67 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. క్విడ్ టాకోమీటర్, ఎలక్ట్రానిక్ మల్టీ ట్రిప్ మీటర్‌తో పాటు అన్ని వేరియంట్‌లలో ABS, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్‌లు, చైల్డ్ సేఫ్టీ లాక్‌లను స్టాండర్డ్‌గా పొందుతుంది. ఈ కారు ఏడు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది.

* మారుతీ సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)

బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎంట్రయిన్‌మెంట్ సిస్టమ్ కోసం మొబైల్ డాక్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారు 800 cc పెట్రోల్ ఇంజన్‌తో 40.36 bhp శక్తిని, 60Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రూ.5 లక్షల బడ్జెట్‌తో ఆల్టో CNG వేరియంట్ ఎంపికను కూడా పొందే అవకాశం ఉంది.

* మారుతీ సుజుకి S-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

మరో మారుతి సుజుకి రూ.5 లక్షల లోపు S-ప్రెస్సో అందిస్తోంది. రూ. 3.85 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. S- ప్రెస్సో 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ యూనిట్‌తో 58.33 bhp, 78Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్టైల్, రోడ్ ప్రెజెన్స్ ఉన్న కారు కోసం చూస్తున్న వారికి S-ప్రెస్సో మంచి ఎంపిక.

SBI ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇలా చేస్తే మోసాలకు బ్రేక్ వేయొచ్చు

* డాట్సన్ రెడి గో (Datsun redi-GO)

డాట్సన్ 2021లో పూర్తిగా రీడిజైన్ చేసిన ఎక్స్‌టీరియర్స్‌తో రెడి గోను ఆవిష్కరించింది. రెడి గోకు సరికొత్త అనుభూతిని అందించడానికి కంపెనీ ఇంటీరియర్‌లపై పనిచేసినట్లు కనిపిస్తోంది. కారు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్యూయల్ టోన్ థీమ్ ఇంటీరియర్‌ను పొందుతుంది. Android Auto, Apple కార్ ప్లేతో అందుబాటులోకి వస్తోంది. ఈ కారు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 67 బీహెచ్‌పీ పవర్, 22 కిమీ/లీటర్ మైలేజీని అందిస్తుంది.

First published:

Tags: Budget, Budget cars, Cars, Indian market, New cars, New features

ఉత్తమ కథలు