హోమ్ /వార్తలు /బిజినెస్ /

UB City: బెంగళూరులోని భూతల స్వర్గం యూబీ సిటీ.. ఇక్కడ ఒక అపార్ట్‌మెంట్ ధర రూ.30 కోట్లు..!

UB City: బెంగళూరులోని భూతల స్వర్గం యూబీ సిటీ.. ఇక్కడ ఒక అపార్ట్‌మెంట్ ధర రూ.30 కోట్లు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా నిర్మించే నగరాలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఒకటి సైన్స్ సిటీగా పేరొందిన బెంగళూరులో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం యూజీ సిటీ (UB city). ఒక మాటలో చెప్పాలంటే, ఈ నగరం భూతల స్వర్గంలా ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Bangalore [Bangalore]

సరికొత్త టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకున్న సెక్టార్లలో నిర్మాణ రంగం ముందుటోంది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కడంతో అద్భుతమైన ఆకృతిలో కట్టడాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా నిర్మించే నగరాలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఒకటి సైన్స్ సిటీగా పేరొందిన బెంగళూరులో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం యూజీ సిటీ (UB city). ఒక మాటలో చెప్పాలంటే, ఈ నగరం భూతల స్వర్గంలా ఉంటుంది.

ఇంటిగ్రెటెడ్‌ డెవలప్‌మెంట్

లగ్జరీ మాల్ (ది కలెక్షన్), విస్తారమైన ఆఫీస్ స్పేస్, ఓక్‌వుడ్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌ వంటి వాటితో యూబీ సిటీని ఇంటిగ్రెటెడ్‌గా డెవలప్ చేశారు. వీటికి అదనంగా నిర్మించిన కింగ్‌ఫిషర్ టవర్స్ (బిలియనీర్ టవర్స్) యూజీ సిటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రంగాలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఇక్కడ నివసిస్తున్నారు.

రూ.1500 కోట్లతో డెవలప్‌మెంట్

యూబీ సిటీ నిర్మాణం 2006 -08 మధ్య ప్రారంభించారు. రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్(బిలియనీర్స్ టవర్స్)ను 2014-16 మధ్య సుమారు రూ.1500 కోట్లతో డెవలప్ చేశారు. స్థానిక రియల్టర్స్ ప్రకారం.. బిలియనీర్ టవర్స్‌లో 8000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ ధర రూ.30 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన ఒక చదరపు అడుగు ధర రూ.35000. యూబీ సిటీని ప్రెస్టీజ్ గ్రూప్, UB 45, 55 శాతం వాటాతో అభివృద్ధి చేశాయి.

స్పెషల్ హెలిప్యాడ్‌

UB సిటీకి తూర్పు దిక్కులో కొన్ని కిలోమీటర్ల దూరంలో MG రోడ్, బ్రిగేడ్ రోడ్ ఉన్నాయి. పడమటి వైపున పచ్చని కబ్బన్ పార్క్ ఉంది. దీంతో యూబీ సిటీ ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ కష్టాలు తీవ్రమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూబీ సిటీలోని యూబీ టవర్‌పై హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు ఇక్కడి నుంచి కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

షోరూమ్స్‌కు నిలయం

బీఎండబ్ల్యూ, ఫోర్సే, హార్లే డేవిడ్‌సన్ వంటి కంపెనీలకు చెందిన షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. లూయిస్ విట్టన్, డీజిల్ , రోలెక్స్ వంటి లగ్జరీ బ్రాండ్స్ షాప్స్ ఉండడంతో UB సిటీ బెంగళూరు వాసులకు వీకెండ్ గమ్యస్థానంగా మారింది.

బిలియనీర్ టవర్స్ ప్రత్యేకతలు

కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక్కడ 34-అంతస్తుల విలాసవంతమైన రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి. దాదాపు 81 అపార్ట్‌మెంట్స్ (4 BHK), 8000 చదరపు అడుగుల నుంచి మూడు బ్లాక్స్‌గా ఉంటాయి. పైన రెండు అంతస్తులలో విలాసవంతమైన పెంట్ హౌస్ ఉంటుంది. ఇది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందినది. అయితే గత రెండేళ్ల క్రితం రూ.50కోట్లకు ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు తెలుస్తోంది.

నివాసం ఉంటున్న ప్రముఖులు

ఈ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో బయోకాన్‌- కిరణ్ మజుందార్ షా, ఫ్లిప్‌కార్ట్‌- సచిన్ బన్సాల్, మెన్సా బ్రాండ్స్- అనంత్ నారాయణన్, జెరోధా - నిఖిల్ కామత్‌లతో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారు ఒక త్రైమాసికానికి మెయింటెనెన్స్ కింద రూ. 5 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

వరల్డ్ క్లాస్ సౌకర్యాలు

ఇందులో క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ఐదు అంతస్తులకు రెండు స్విమ్మింగ్ పూల్స్, ఒక జిమ్, స్పా‌తో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. బిలియనీర్ టవర్స్‌లోని అపార్ట్‌మెంట్ ప్రారంభ ధర రూ.20 కోట్లు కాగా, రీసేల్ విలువ రూ.30 కోట్లకు పైగా పెరిగిందని, సగటు నెలవారీ అద్దె రూ.10 లక్షలుగా ఉందని స్థానిక రియల్టర్స్ చెబుతున్నారు.

First published:

Tags: Bangalore

ఉత్తమ కథలు