news18-telugu
Updated: December 1, 2020, 7:21 PM IST
Ather 450X electric scooter. (Photo: Ather Energy)
స్కూటర్ షేరింగ్ సర్వీసులో బెంగళూరు సిటీ ప్రపంచంలోనే నం1 సిటీగా నిలిచింది. జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ మానిఫాక్చర్ సంస్థ యూఎన్యూ(UNU) తాజాగా ఈ వివరాలను ప్రకటించింది. ప్రపంచంలో మొత్తం 1,04,00 స్కూటర్లు షేర్ అవుతున్నట్లు తెలిపింది. అయితే ఈ సంఖ్య 2019లో కేవలం 66 వేలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వీటిని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 4.8 మిలియన్ నుంచి 8.7 మిలియన్లకు పెరిగినట్లు తెలిపింది. UNU తెలిపిన వివరాల ప్రకారం భారత దేశం ఈ సేవల్లో నంబర్ 1 గా ఉన్నట్లు వెల్లడిచింది. దేశంలోని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ సేవలు అధికంగా వినియోగించుకుంటున్నారు.
UNU తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటర్ షేర్ సేవలను అత్యధికంగా కలిగిన దేశాల్లో ఇండియా(25 వేల స్కూటర్లు), స్పెయిన్(23, 050), తైవాన్(15,350), ఇటలీ(8800), జర్మనీ(7 వేలు), యూఎస్ఏ(6100), ఫ్రాన్స్ (5750), నెదర్లాండ్స్ (5650), పోలాండ్ (2350), పోర్చుగల్ (1250) ఉన్నాయి.
ప్రపంచంలో స్కూటర్ షేర్ ఆఫర్లు పాపులర్ గా కలిగిన టాప్ సిటీల్లో బెంగళూరు (ఇండియా)- 22,000 స్కూటర్లతో ప్రథమ స్థానంలో ఉంది. మరో ప్రముఖ నగరమైన ఇటలీలోని మిలాన్ 4900 స్కూటర్లతో ఐదవ స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ లోని పారీస్ నగరం 4250 స్కూటర్లతో ఆరవ స్థానంలో ఉంది. రోమ్ 3300 స్కూటర్లతో ఏడవ స్థానంలో, న్యూయార్క్ 3000 వేల స్కూటర్లతో 9వ స్థానం, హైదరాబాద్ కూడా దాదాపు 3 వేల స్కూటర్లతో అదే స్థానంలో ఉంది.
Published by:
Nikhil Kumar S
First published:
December 1, 2020, 7:15 PM IST