ఏటీఎంలో డబ్బులు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కొన్ని చోట్ల వాటర్ ఏటీఎంలు (Water ATM) పెట్టారు. అంటే కాయిన్స్ వేసి బాటిల్‌లో నీళ్లు నింపుకొని వెళ్లొచ్చు. ఇలా ఏటీఎంను వేర్వేరు సేవల కోసం ఉపయోగిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ (Startup) కొత్తగా ఆలోచించింది. ఏటీఎం ద్వారా ఇడ్లీలను సప్లై చేస్తోంది. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. దీన్ని ఇడ్లీ బాట్ లేదా ఇడ్లీ ఏటీఎం (Idli ATM) అని పిలుస్తారు. ఇడ్లీ తయారు చేయడం, ప్యాకేజీ చేయడం, సప్లై చేయడం లాంటి ప్రాసెస్ మొత్తం వెంటవెంటనే జరిగిపోతుంది.
బెంగళూరుకు చెందిన ఆంట్రప్రెన్యూర్స్ షరన్ హీరేమత్, సురేష్ చంద్రశేఖరన్ ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ఇడ్లీ ఏటీఎంను తయారు చేసింది. బెంగళూరులో మొదటి ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది ఈ స్టార్టప్. మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు, వేడివేడి ఇడ్లీ పార్శిల్‌లో వచ్చేస్తుంది. అక్కడే చట్నీ, సాంబార్ కూడా ఉంటుంది. పార్శిల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. లేదా ఇడ్లీ అక్కడే టేస్ట్ చేయొచ్చు. ఇడ్లీ ఏటీఎం ఎలా పనిచేస్తుందో వీడియో చూడండి.
IRCTC Tour: రూ.536 ఈఎంఐతో జ్యోతిర్లింగాల దర్శన యాత్ర... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
Idli ATM in Bangalore... pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban (padmanaban@fortuneinvestment.in) (@padhucfp) October 13, 2022
ఈ అద్భుతమైన ఐడియా వెనుక షరన్ హీరేమత్ ఎదుర్కొన్న అనుభవమే కారణం. 2016లో తన కూతురుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అర్ధరాత్రి ఇడ్లీ కొనడానికి బయటకు వెళ్లాడు. కానీ ఎక్కడా రెస్టారెంట్లు తెరిచిలేవు. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు ఉన్నట్టు, ఇడ్లీ కొనడానికి ఏటీఎంలు ఎందుకు ఉండకూడదని అనుకున్నాడు. ఇదొక్కటే కాదు ఓసారి హీరేమత్, చంద్రశేఖరన్ రోడ్ ట్రిప్‌కు వెళ్తే పాడైన ఓ హోటల్‌లో పాడైన ఇడ్లీలు సప్లై చేశారు. ఎప్పుడైనా ఫ్రెష్ ఇడ్లీ సప్లై చేయడానికి ఇడ్లీ ఏటీఎం తయారు చేయాలన్న ఆలోచనతో ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్ ప్రారంభించారు.
Account Balance: మీ అకౌంట్ బ్యాలెన్స్ ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా
ఆటోమెటిక్ మెషీన్ సాయంతో ఎప్పుడైనా ఇడ్లీ కొనడానికి ఇది సరైన మార్గమని వారి అభప్రాయం. తమ ఫుడ్‌బాట్ ఇడ్లీలు మాత్రమే కాదు, దక్షిణ భారత దేశానికి చెందిన రుచికరమైన వంటకాలను అందించే మొదటి పూర్తి ఆటోమేటెడ్ కుకింగ్ అండ్ వెండింగ్ మెషీన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో రెండు లొకేషన్లలో వీటిని చూడొచ్చు. త్వరలో ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఈ మెషీన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఇన్నారు. కేవలం ఇడ్లీ బాట్ కాకుండా దోశా బాట్, రైస్ బాట్, జ్యూస్ బాట్లను పరిచయం చేస్తామంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Idli, VIRAL NEWS, Viral tweet, Viral Video