హోమ్ /వార్తలు /బిజినెస్ /

Benelli Imperiale bike: సూపర్ బైక్ కొనాలని ఉందా..ధరతో చూసి భయపడుతున్నారా..సులభ EMIలతో మీకోసం...

Benelli Imperiale bike: సూపర్ బైక్ కొనాలని ఉందా..ధరతో చూసి భయపడుతున్నారా..సులభ EMIలతో మీకోసం...

benelli imperiale 400

benelli imperiale 400

బెనెల్లి ఇండియా ఇటీవల విడుదల చేసిన రెట్రో-క్లాసిక్ బైక్ ఇంపీరియల్-400పై మరో ఆఫర్ ను ప్రకటించింది. ఈ బైక్ కొనుగోలుపై తక్కువ మొత్తంలో EMI చెల్లింపుల విధానాన్ని ఆ సంస్థ ప్రకటించింది. EMI పథకం నెలకు 4999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

ఇంకా చదవండి ...

బెనెల్లి ఇండియా ఇటీవల విడుదల చేసిన రెట్రో-క్లాసిక్ బైక్ ఇంపీరియల్-400పై మరో ఆఫర్ ను ప్రకటించింది. ఈ బైక్ కొనుగోలుపై తక్కువ మొత్తంలో EMI చెల్లింపుల విధానాన్ని ఆ సంస్థ ప్రకటించింది. EMI పథకం నెలకు 4999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 85శాతం ఫండింగ్ తో బెనెల్లి డీలర్ షిప్ లో ఈ ఆఫర్లను పొందవచ్చు. ఇంపీరియల్-400 ప్రారంభ ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని బుకింగ్ కు అదనంగా రూ.6,000 ఖర్చవుతుంది. బెనెల్లి డీలర్ షిప్ లతో పాటు కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ బైక్ ను కొనుక్కోవచ్చు.

ఆకట్టుకునే ఫీచర్లు

బెనెల్లి ఇంపీరియల్-400 ఇంజన్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 374 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో ఈ బైక్ పనిచేస్తుంది. ఇది 21PS శక్తిని, 29 Nm టార్క్ ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. BS-VI నియమాల ప్రకారం దీన్ని రూపొందించారు. 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 18-అంగుళాల వెనుక చక్రాలు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముందు భాగంలో 300mm సింగిల్ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్లతో ఈ అత్యాధునిక బైక్ ను ఆకర్షణీయంగా తయారుచేశారు. దీని డిజైన్ వినియోగదారులకు ఆకట్టుకునేలా ఉంది. ప్రీ-లోడ్ ఎడ్జెస్టబుల్ రియర్ సస్పెన్షన్, డ్యుయల్ ఛానల్ ABS వంటి అదనపు ఫీచర్లు ఈ బైక్లో ఉన్నాయి.

Benelli Imperiale 400. (Photo: Benelli India)

అదనపు ప్రయోజనాలున్నాయి

ఈ బైక్ను కొన్నవారికి బెనెల్లి అదనపు ప్రయోజనాలను కూడా కల్పించనుంది. ఇంపీరియల్-400తో మూడు సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, రెండు సంవత్సరాల కాంప్లిమెంటరీ సేవలను వినియోగదారులకు అందిస్తామని సంస్థ ప్రకటించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా ఇంపీరియల్-400 బైక్ ను బెనెల్లి మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్, సిల్వర్, బ్లాక్ కలర్ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. 205 కిలోల బరువు ఉండే ఈ బైక్ లో 12 లీటర్ల పెట్రోలు నింపుకోవచ్చు. 1950ల్లో రూపొందించిన బెనెల్లి మోటో బీ మోడల్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇంపీరియల్ను రూపొందించారు. గతేడాది అక్టోబరులో దీన్ని భారత్లో విడుదల చేశారు. లాక్ డౌన్కు ముందు ఈ బైక్కు మంచి స్పందన వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం ఈఎమ్ఐ ఆప్షన్ ను ఈ సంస్థ ప్రకటించింది.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు