హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bike Insurance: రోడ్ ట్రిప్‌కు వెళ్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Bike Insurance: రోడ్ ట్రిప్‌కు వెళ్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

 (Photo: BMW Motorrad)

(Photo: BMW Motorrad)

అనుకోని ప్రమాదాల బారిన పడినప్పుడు నష్టాన్ని తగ్గించే యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌(Accidental Damage) వంటి పాలసీలను బైక్ రైడర్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎన్‌బీసీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇచ్చారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ జైన్. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొత్త ప్రదేశాలను చూడటం, పర్యటనలకు వెళ్లడం అందరికీ ఇష్టమే. అదే బైకులపై కొత్త ప్రదేశాలను చుట్టి వస్తే ఆ మజానే వేరు. ఇటీవల ఇండియాలో బైకుల(Bikes)పై లాంగ్‌ ట్రిప్‌లకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. కొంతమంది స్నేహితులు(Friends) ఒక గ్రూప్‌గా లగ్జరీ బైక్స్‌పై ఇండియన్ టూరిస్ట్ స్పాట్స్‌కు వెళ్లడం ఇప్పుడు కామన్‌గా మారింది. అయితే ఈ క్రేజీ అడ్వెంచర్ ట్రిప్ సమయంలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే సరైన భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యం. అనుకోని ప్రమాదాల బారిన పడినప్పుడు నష్టాన్ని తగ్గించే యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌(Accidental Damage) వంటి పాలసీలను బైక్ రైడర్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎన్‌బీసీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇచ్చారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ జైన్. అవేంటో చూద్దాం.

* యాక్సిడెంటల్ డ్యామేజ్ పాలసీ ఎందుకు?

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. మానవుల తప్పిదాలు, లేదా ప్రకృతి పరంగా ఇవి సంభవించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనం, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటివి ఎదురైనప్పుడు తీవ్రమైన నష్టాలను భరించాల్సి వస్తుంది. అదనపు ఖర్చులకు కారణమయ్యే దురదృష్టకర అంశాలను నివారించడానికి ముందే ఆర్థిక భద్రతను అందించే టూ వీలర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలి.

* టూ వీలర్ ఓన్-డ్యామేజ్ కవర్ ప్రయోజనాలు

చట్టప్రకారం టూ వీలర్లకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది ప్రమాదంలో మరణించిన, గాయపడిన, నష్టపోయిన ఎదుటివారిని కవర్ చేస్తుంది. దీని ద్వారా ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి వాటి నుంచి సొంత వాహనానికి ఎలాంటి భద్రత లభించదు. ఈ సందర్భాల్లో ఓన్‌-డ్యామేజ్‌ కవర్‌ ఆర్థిక రక్షణ అందిస్తుంది. నష్టాలను భర్తీ చేస్తుంది, దెబ్బతిన్న పార్ట్స్‌ను బాగు చేసుకోవడానికి, లేదా రీప్లేస్‌ చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

కొన్ని ఇన్సూరెన్స్‌ సంస్థలు తమ నెట్‌వర్క్‌ పరిధిలోని గ్యారేజీల వద్ద ఓన్‌-డ్యామేజ్ కవర్‌లో భాగంగా క్యాష్‌లెస్‌ సేవలను కూడా అందిస్తాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీ నెట్‌వర్క్ గ్యారేజీలో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదంలో బైకు పూర్తిగా దెబ్బతిన్నా ముందుగా డిక్లేర్‌ చేసిన మొత్తాన్ని కంపెనీ అందిస్తుంది.

* ఆసరాగా యాడ్‌-ఆన్స్‌

24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్‌ బైకులపై లాంగ్‌ ట్రిప్‌లకు వెళ్లే వారికి చాలా ఉపయోగపడుతుంది. అనుకోని సమయాల్లో, ఊహించిన ప్రదేశాల్లో బైక్‌ పాడైతే, ఇన్సూరెన్స్‌ కంపెనీ నెట్‌వర్క్ గ్యారేజ్ నుంచి సహాయం అందుతుంది.

ఏదైనా ప్రాంతంలో బైకు రిపేర్ అయి గ్యారేజీకి వెళ్లినప్పుడు, బైకును ఎవరైనా దొంగిలించినప్పుడు అక్కడే రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ హోటల్ అకామడేషన్‌ యాడ్‌-ఆన్ కవర్‌ మేలు చేస్తుంది. ఇన్సూరెన్స్‌ కంపెనీ హోటల్ రూం ఖర్చులను చెల్లిస్తుంది.

ఇది కూడా చదవండి : బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు

బైకు ప్రమాదానికి గురై మీరు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే హాస్పిటల్ క్యాష్ యాడ్-ఆన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉంటే.. ఈ కవర్‌తో ఖర్చుల మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్ పొందుతారు.

* ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి

ప్రమాదాలు అనుకోకుండా ఎదురవుతాయి. అందుకే సేఫ్టీని ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. దురదృష్టవశాత్తు జరిగే నష్టాలను నివారించలేకపోయినా ఓన్‌ డ్యామేజ్‌ పాలసీలతో తీవ్రత తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అనుకోని కష్టాలలో తోడు అవుతుందని, అవసరమైన సహకారం లభిస్తుందని చెబుతున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bikes, Insurance, Personal Finance, Travel, Travelling

ఉత్తమ కథలు