హోమ్ /వార్తలు /బిజినెస్ /

Alert: చెక్ పైన డేట్ రాస్తున్నారా? 2020 లో జాగ్రత్త... ఎందుకో తెలుసా?

Alert: చెక్ పైన డేట్ రాస్తున్నారా? 2020 లో జాగ్రత్త... ఎందుకో తెలుసా?

7. మీ చెక్కుల సంఖ్యను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, 'సబ్మిట్'పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)

7. మీ చెక్కుల సంఖ్యను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, 'సబ్మిట్'పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)

డాక్యుమెంట్లు, చెక్కులపై డేట్స్ రాసే విషయంలో అలర్ట్‌గా ఉండాలి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్.

  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అందరూ 2020 సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. డిసెంబర్ 31న గ్రాండ్‌గా పార్టీ చేసుకోబోతున్నారు. కానీ... 2020 సంవత్సరానికి సంబంధించి మీకు ఓ చిక్కు ఎదురుకానుంది. డేట్ విషయంలో ఓ సమస్య ఏర్పడనుంది. చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై డేట్ రాసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోకపోతే కొంపమునిగే ప్రమాదం ఉంది. ఎలాగో తెలుసుకోండి. ఉదాహరణకు మీరు 2020 జనవరి 25 అని చెక్ పైన డేట్ రాయాలంటే ఎలా రాస్తారు. చాలామందికి 25/01/20 ఇలా రాసే అలవాటు ఉంటుంది. ఇక్కడే మీకు ఓ సమస్య ఎదురవుతుంది. మీరు సంవత్సరం దగ్గర కేవలం 20 అని రాసి వదిలేస్తే 20 నెంబర్ తర్వాత ఏ నెంబర్ అయినా రాయొచ్చు. 20 తర్వాత 18 రాస్తే 2018 అవుతుంది. 19 రాస్తే 2019 అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్లు, చెక్‌లపైన తేదీలు మార్చడం చాలా సులువు.

  మీరు భవిష్యత్తు డేట్‌తో చెక్, లేదా డాక్యుమెంట్ రాసి ఇచ్చినా... దాన్ని 2018 లోనో, 2019 లోనో ఇచ్చినట్టు మారిస్తే మీరు చిక్కుల్లో పడటం ఖాయం. అందుకే డాక్యుమెంట్లు, చెక్కులపై డేట్స్ రాసే విషయంలో అలర్ట్‌గా ఉండాలి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. సంవత్సరాన్ని పూర్తిగా రాస్తే సరిపోతుంది. అంటే... మీరు 2020 జనవరి 25 అని చెక్ పైన డేట్ రాయాలంటే 25/01/2020 అని పూర్తిగా రాయాలి. అప్పుడు ఆ డేట్ మార్చే ఛాన్సే లేదు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో, చెక్‌లపైన ఇలా పూర్తిగా డేట్ రాయడం మర్చిపోవద్దు. లేకపోతే మిమ్మల్ని ఛీట్ చేసే ప్రమాదం ఉంది.

  రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  2020 Bank Holidays: బ్యాంకులకు వచ్చే ఏడాది సెలవులు ఎప్పుడో తెలుసుకోండి

  SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి

  EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, New Year 2020, Personal Finance

  ఉత్తమ కథలు