హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cash Transactions: కొంపదీసి లిమిట్‌కు మించి క్యాష్ పేమెంట్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు

Cash Transactions: కొంపదీసి లిమిట్‌కు మించి క్యాష్ పేమెంట్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cash Transactions: పెద్ద మొత్తంలో చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కొన్నిసార్లు చట్టబద్ధం కావని, ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. లోన్ లేదా డిపాజిట్ కోసం రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఫిజికల్ క్యాష్‌ను స్వీకరించడంపై నిషేధం ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆసుపత్రులు (Hospitals), బాంకెట్ హాళ్లు, వ్యాపార సంస్థలలో క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ (Cash Transcations)పై నిఘా ఉంచాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కొన్నిసార్లు చట్టబద్ధం కావని, ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. లోన్ లేదా డిపాజిట్ కోసం రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఫిజికల్ క్యాష్‌ను స్వీకరించడంపై నిషేధం ఉంది. అలాంటి ట్రాన్సాక్షన్లను తప్పనిసరిగా బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేయాలి.

ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని క్యాష్ రూపంలో స్వీకరించడానికి కూడా అనుమతి లేదు. నమోదిత ట్రస్ట్ లేదా రాజకీయ పార్టీకి నగదు రూపంలో చేసిన విరాళాలు డిడక్షన్స్ కిందకు రావు. ఈ నిబంధనలను అమలు చేయడానికి IT విభాగం ఆసుపత్రులతో సహా కొన్ని వ్యాపారాలు, వృత్తులలో క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ను పర్యవేక్షిస్తుంది. కొంతమంది నిపుణులు కూడా డిపార్ట్‌మెంట్ రాడార్‌లో ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదించింది.

హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లు రోగుల పాన్ కార్డులను తప్పనిసరిగా సేకరించాలని చట్టం నిర్దేశిస్తుంది. అయితే అనేక సందర్భాల్లో హాస్పిటళ్లు ఈ నియమాన్ని విస్మరించాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి ఆసుపత్రులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సేవలను అందించే సంస్థల డేటాను సేకరించి, ప్రైవేట్ హాస్పిటళ్లకు పెద్ద మొత్తంలో క్యాష్ పేమెంట్ చేసిన రోగులను అధికారులు ట్రాక్ చేస్తున్నట్లు టైమ్స్‌ ఆఫ్ ఇండియా నివేదిక జోడించింది.

ఇలాంటి సందర్భాల్లో రిటర్నులలో అవకతవకలను గుర్తించేందుకు పన్ను శాఖ ‘యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్’ వంటి వివరణాత్మక డేటాను ఉపయోగిస్తోందని నివేదిక పేర్కొంది. అందుకే బిల్లులు చెల్లించేందుకు క్యాష్‌ను పరిమితికి మించి వాడకూడదని, దీంతోపాటు ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ విషయంలో సమగ్ర వివరాలను అందించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచి స్టార్ట్ చేసే క్రియేటివ్ బిజినెస్ ఐడియా.. వేలల్లో లాభాలు..

* సరైన ఆదాయ వివరాలను ఎలా చెక్ చేయాలి? ఎలా సమర్పించాలి..?

పన్ను చెల్లింపుదారులు అవసరమైన డాక్యుమెంట్స్ అందజేయడంతో పాటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమరీలో (TIS) వివరాల ప్రకారం సరైన సమాచారం అందివ్వాలి. పన్ను రిటర్న్‌లో సమర్పించిన సమాచారం, AIS, TIS వివరాలలో ఏదైనా తేడా ఉంటే.. ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు. 2021లో ప్రారంభమైన AIS అనేది గత సంవత్సరంలో వ్యక్తిగత ఆర్థిక లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను కలిగి ఉన్న డాక్యుమెంట్.

ఇది సేవింగ్స్ అకౌంట్/ఫిక్స్‌డ్ డిపాజిట్లు, TDS, డివిడెండ్‌ల ఆదాయాలు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా అలాంటి ఇతర పెట్టుబడులపై పొందిన వడ్డీతో సహా ఆదాయ పన్ను చట్టంలో నిర్దేశించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో వారి అకౌంట్‌కు లాగిన్ అయ్యి, వారి AISను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని "సర్వీసెస్" ట్యాబ్ లిస్ట్ నుంచి AIS, TISలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Cash, Hospitals, Income tax, ITR Filing, Money