దేశ జీడీపి గుండు సున్నా...బార్‌క్లేస్‌ తాజా అంచనా ఇదే...

దేశ జీడీపి గుండు సున్నా...బార్‌క్లేస్‌ తాజా అంచనా ఇదే...

ప్రతీకాత్మక చిత్రం

2020 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8% ఉంటుందని తన తాజా పరిశోధనాలో అభిప్రాయపడింది.

 • Share this:
  లాక్ డౌన్ కారణంగా 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8% ఉంటుందని తన తాజా పరిశోధనాలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్‌డౌన్‌ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని బార్‌క్లేస్‌ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి 3.5% ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’,0.8 శాతంగా తగ్గించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్‌ డాలర్లు (డాలర్‌ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందన బార్‌క్లేస్‌ ప్రతినిధి రాహుల్ బజోరియా ఒక నివేదికలో అంచనా వేశారు. తొలి మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 120 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల ఈ అంచనాలను భారీగా 234.4 బిలియన్‌ డాలర్లకు పెంచింది.

  మే 17 వరకు ప్రభుత్వం లాక్డౌన్‌ను మరో రెండు వారాల పాటు అధికారికంగా పొడిగించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గణనీయమైన సడలింపులను ప్రకటించింది, ఇప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించింది. ఇది ప్రమాదాల స్థాయి, కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని సూచిస్తుంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో గ్రేడెడ్ ప్రాతిపదికన ఆర్థిక కార్యకలాపాలపై గణనీయమైన సడలింపులను అనుమతించింది.

  అయితే, పట్టణ ప్రాంతాలు మరియు ఆర్థికంగా దేశానికి వెన్నెముకగా నిలిచే ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి అన్ని నగరాలు రెడ్ జోన్లో ఉండటం వల్ల ఆర్థికం సాధారణ స్థితి ఉద్భవించటానికి ఎక్కువ సమయం పడుతుంది" అని బజోరియా చెప్పారు.
  Published by:Krishna Adithya
  First published:

  అగ్ర కథనాలు