BAR CODES ON IRCTC FOOD PACKETS KNOW HOW TO CHECK BARCODES AND WATCH LIVE FOOTAGE OF IRCTC KITCHENS SS
IRCTC Food: ఐఆర్సీటీసీ ఫుడ్ ప్యాకెట్లపై ఇక బార్ కోడ్స్... ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Bar code on IRCTC food packet | ఐఆర్సీటీసీ సరఫరా చేసే ప్రతీ ఫుడ్ ప్యాకెట్‌పై బార్ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో బార్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ ఫుడ్ ప్యాకెట్ ఏ కిచెన్‌లో ప్యాక్ చేశారో, ఎక్కడ వంట చేశారో తెలిసిపోతుంది.
ప్రయాణికులకు ఇస్తున్న సేవల్ని మరింత మెరుగుపరుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తకొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. పారదర్శకత, జవాబుదారీ తనం పెంచేందుకు ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్ దృష్టి డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించారు. అందులో భాగంగానే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సప్లై చేసే ఫుడ్ పార్శిళ్లపై బార్ కోడ్స్ ప్రవేశపెట్టనుంది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీలో ఆహార నాణ్యతను పెంచే చర్యల్లో భాగంగా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మంచి భోజనం అందించేందుకు ఈ ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తుంది రైల్వే శాఖ.
ఐఆర్సీటీసీ ప్రయాణికులకు సప్లై చేసే ఆహారం నాణ్యత విషయంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పూరీ-హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి భోజనంలో పురుగు, మరో ప్రయాణికుడికి చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఉదాహరణలెన్నో. దీంతో రైళ్లల్లో భోజనం అంటే ప్రయాణికులకు నమ్మకం లేకుండా పోయింది. అందుకే ప్రయాణికులకు నమ్మకం కల్పించేందుకు, ఐఆర్సీటీసీలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు ఫుడ్ ప్యాకెట్లపై బార్ కోడ్స్ విధానాన్ని ప్రవేశపెడుతోంది రైల్వే.
ఐఆర్సీటీసీ సరఫరా చేసే ప్రతీ ఫుడ్ ప్యాకెట్‌పై బార్ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో బార్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ ఫుడ్ ప్యాకెట్ ఏ కిచెన్‌లో ప్యాక్ చేశారో, ఎక్కడ వంట చేశారో తెలిసిపోతుంది. ఆ ఆహారం నాణ్యతలో ఏదైనా లోపం ఉంటే ఆ కిచెన్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటుంది ఐఆర్సీటీసీ. దీని ద్వారా కిచెన్ నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. అంతే కాదు... మీకు వచ్చిన ఫుడ్ ప్యాకెట్ ఏ కిచెన్‌లో ప్యాక్ చేశారో మీరు బార్ కోడ్ ద్వారా తెలుసుకొని, ఆ కిచెన్ ఎలా ఉందో మీ స్మార్ట్‌ఫోన్‌లో సీసీటీవీ దృశ్యాలు చూడొచ్చు. ఇందుకోసం మీరు రైల్ దృష్టి డ్యాష్‌బోర్డ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో IRCTC kitchen ట్యాబ్ క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ ఐఆర్సీటీసీ కిచెన్లు ఉన్నాయో జాబితా కనిపిస్తుంది. మీకు ఇచ్చిన ఆహారాన్ని వండిన క్యాంటీన్ పేరు సెలెక్ట్ చేస్తే అక్కడి సీసీటీవీ దృశ్యాలను రియల్‌టైమ్‌లో చూడొచ్చు.
Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.