Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా?

Rs 2000 Notes | రూ.2,000 నోట్లు ఏటీఎంలో రాకపోతే కంగారుపడుతున్నారా? రూ.2,000 నోట్లను చలామణిలో లేకుండా చేస్తారన్న అనుమానాలున్నాయా? రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ తగ్గిపోతుందని డౌట్ వస్తుందా? అసలు కారణాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 26, 2020, 11:46 AM IST
Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా?
Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పెద్ద నోట్లకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇకపై ఏటీఎంలో రూ.2000 నోట్లు రావన్నది ఆ వార్త సారాంశం. రూ.2,000 నోట్లను రద్దు చేస్తారా అన్న అనుమానాలు, సందేహాలు చాలాకాలంగా ఉన్నవే. ఇప్పుడు రూ.2,000 నోట్లు ఏటీఎం నుంచి రావన్న వార్తతో మళ్లీ అవే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో రూ.2,000 నోట్లను నిలిపివేస్తుందన్న వార్తలు మొదట వచ్చాయి. పెద్ద నోట్లకు చిల్లర తీసుకోవడం కస్టమర్లకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో రూ.2,000 నోట్లను అసలు ఏటీఎంలోనే లేకుండా చేయాలన్నది అసలు కారణం. ఇండియన్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3,988 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో మార్చి 1 నుంచి కేవలం రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే లభిస్తాయి.

కేవలం ఇండియన్ బ్యాంకు మాత్రమే కాదు... మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటపట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలో భారీగా మార్పులు జరగనున్నాయి. రూ.2,000 నోట్ల స్థానంలో రూ.500 నోట్లను రీప్లేస్ చేయనున్నారని బిజినెస్ స్టాండర్డ్ కథనం పబ్లిష్ చేసింది. ప్రతీ ఏటీఎంలో నాలుగు క్యాసెట్లు ఉంటాయి. ఇప్పటివరకైతే వాటిలో రూ.2,000, రూ.500, రూ.200, రూ.100 నోట్లను సర్దుతారు. ఇకపై ఈ పద్ధతి మారనుంది. మూడు క్యాసెట్లలో రూ.500 నోట్లు, నాలుగో క్యాసెట్‌లో రూ.100 లేదా రూ.200 నోట్లు ఉంటాయి. అంటే ఇప్పటివరకు రూ.2,000 నోట్లు నింపే క్యాసెట్లలో కూడా రూ.500 నోట్లు ఏర్పాటు చేయనున్నాయి బ్యాంకులు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రూ.2,000 నోట్లు నింపే క్యాసెట్లలో రూ.500 నోట్లు నింపుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న 2,40,000 పైగా ఏటీఎంలల్లో ఈ మార్పులు జరగనున్నాయి. అన్ని ఏటీఎంలో ఈ మార్పులు పూర్తిగా జరగడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మార్పులు జరిగిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే పొందగలరు. అయితే ఇప్పటికే మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అవి చెల్లుతాయి. వాటిని ఎక్కడైనా చలామణి చేయొచ్చు. కాకపోతే పెద్ద నోట్లు ఏటీఎంలో లభించవు. రూ.2,000 నోట్లకు చిల్లర కోసం సామాన్యులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. పెద్ద నోట్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసమే ఈ మార్పులు చేస్తున్నట్టు పలు బ్యాంకులు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా

Tatkal Train Ticket Booking: గుడ్ న్యూస్... తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ ఇంకా ఈజీ

EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading