• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BANKS WILL MAY OPEN BANK LOCKERS IF CUSTOMERS WILL NOT OPEN IT FROM LONG TIME FULL DETAILS HERE HSN GH

Bank lockers: బ్యాంక్ లాకర్లను వాడుతున్నారా? ఈ ఒక్క తప్పు కనుక చేస్తే బ్యాంకులే మీ లాకర్లను..

Bank lockers: బ్యాంక్ లాకర్లను వాడుతున్నారా? ఈ ఒక్క తప్పు కనుక చేస్తే బ్యాంకులే మీ లాకర్లను..

ప్రతీకాత్మక చిత్రం

మీరు బ్యాంకు లాకర్స్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారా..? ఒక్క పొరపాటు చేస్తే కనుక బ్యాంకులే మీ లాకర్లను ఓపెన్ చేస్తాయని మీకు తెలుసా..? అసలు బ్యాంకు లాంకర్స్ విషయంలో ఏమేం నియమాలు ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా సూచిస్తోంది. ఎక్కువ రోజులు లాకర్‌ను తెరవని సందర్భంలో బ్యాంకులే స్వయంగా కస్టమర్ల లాకర్లను ఓపెన్ చేయవచ్చని ఆర్బీఐ చెబుతోంది. సాధారణంగా ఆభరణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచడానికి బ్యాంకు లాకర్లను వాడుకుంటారు. ఒక్కసారి వీటిల్లో భద్రపరిచిన తరువాత.. చాలామంది వాటి గురించి పట్టించుకోరు. కానీ నియమాల ప్రకారం బ్యాంకు లాకర్లను ఏడాదికి ఒక్కసారైనా సందర్శించాలి. లేదంటే మీ బ్యాంకే లాకర్‌ను తెరవవచ్చు. ఆ అధికారం బ్యాంకులకు ఉంటుంది. తక్కువ రిస్క్ (లో రిస్క్) కేటగిరీలో ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు కాస్త సమయం ఇస్తాయి. కానీ మీడియం రిస్క్ విభాగంలో ఉన్నవారు మూడేళ్ల వరకు లాకర్‌ ఓపెన్ చేయకపోతే.. వారికి బ్యాంకు నోటీసు పంపుతుంది.

దరఖాస్తు చేసుకున్న అందరికీ లాకర్లను కేటాయించరు. ఇందుకు బ్యాంకులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులను మొత్తం మూడు రిస్క్ కేటగిరీలుగా వర్గీకరిస్తాయి. ఇందుకు ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యాపార కార్యకలాపాల స్వభావం, కస్టమర్లు నివాసముండే ప్రాతం.. వంటివి పరిగణనలోకి తీసుకుంటాయి. వీటి ఆధారంగా ఖాతాదారులను హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ విభాగాలుగా విభజిస్తాయి. ఆ ప్రకారమే వారికి లాకర్లు కేటాయిస్తాయి.
ఇది కూడా చదవండి: Gold Loan: గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

నోటీసులు పంపుతుంది
లాకర్‌ను ఎక్కువ కాలం తెరవకుండా ఉంచితే.. కస్టమర్లకు బ్యాంకు ఒక నోటీసు పంపుతుంది. లాకర్ సదుపాయాన్ని కొనసాగించాలని లేదా సరెండర్ చేయాలని నోటీసుల్లో సూచిస్తుంది. ఎక్కువ రోజులు లాకర్‌ను ఎందుకు ఆపరేట్ చేయలేదనే వివరాలను కస్టమర్లు బ్యాంకుకు రాతపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. ఖాతాదారులు చెప్పిన కారణాలు నిజమైనవని బ్యాంకు నమ్మితేనే లాకర్ సదుపాయాన్ని కొనసాగిస్తాయి. ప్రవాస భారతీయులు, ఉద్యోగంలో బదిలీపై వేరే ప్రాంతాల్లో ఉంటున్నవారు, ఏదైనా ఇతర కారణాలతో నగరంలో లేనివారు లాకర్ సదుపాయాన్ని కొనసాగించేందుకు బ్యాంకు అనుమతించవచ్చు.

ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ఖాతాదారులకు తెలియజేయాలి
ఒకవేళ బ్యాంకు నోటీసులకు ఖాతాదారుడు సరైన వివరణ ఇవ్వకపోతే.. లాకర్ సదుపాయాన్ని బ్యాంకు రద్దు చేస్తుంది. కస్టమర్లు లాకర్‌కు సంబంధించిన అన్ని ఫీజులు చెల్లించినా సరే, వాటిని నిర్ణీత సమయానికి ఓపెన్ చేయకపోతే రద్దు చేయవచ్చు. ఆ లాకర్‌ను వేరొకరికి కేటాయించవచ్చు. కస్టమర్లకు కేటాయించి, ఆ తరువాత రద్దు చేసిన లాకర్లను తెరిచేటప్పుడు బ్యాంకు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంది. సరైన విధానాన్ని పాటిస్తున్నట్లు కస్టమర్లకు తెలియజేస్తుంది. ఇవన్నీ లాకర్ కేటాయించేటప్పుడు చేసుకున్న అగ్రిమెంట్‌లో భాగంగా ఉంటాయి. ఒప్పందం చేసుకునే సమయంలోనే ఈ నిబంధన గురించి ప్రతి బ్యాంకు ఖాతాదారునికి సమాచారం అందించాల్సి ఉంటుంది. కస్టమర్లు సైతం వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే లాకర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..
First published:

అగ్ర కథనాలు