ATM Cards: మార్చి 16 లోగా కార్డు వాడకపోతే ఆన్‌లైన్ సేవలు నిలిపివేత

Debit Card | మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు చాలాకాలంగా ఉపయోగించట్లేదా? అయితే ఆ కార్డులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 10, 2020, 2:43 PM IST
ATM Cards: మార్చి 16 లోగా కార్డు వాడకపోతే ఆన్‌లైన్ సేవలు నిలిపివేత
ATM Cards: మార్చి 16 లోగా కార్డు వాడకపోతే ఆన్‌లైన్ సేవలు నిలిపివేత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? మీ డెబిట్ కార్డును ఎక్కడా వాడట్లేదా? అయితే మీ డెబిట్ కార్డ్ పర్మనెంట్‌గా బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. మీ డెబిట్ కార్డును మార్చి 16 లోగా వాడకపోతే కార్డు బ్లాక్ కావడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జనవరి 15న జారీ చేసిన నోటిఫికేషన్‌లోనే ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటివరకు మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి మీ డెబిట్ కార్డులు ఉపయోగించకపోతే మార్చి 16న నుంచి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ సదుపాయాలు ఆగిపోనున్నాయి. అంటే మీరు ఇకపై ఆ కార్డుల్ని ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించలేరు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ సేవల్ని నిలిపివేయాలని క్రెడిట్, డెబిట్ కార్డుల్ని జారీ చేసిన బ్యాంకుల్ని ఇప్పటికే కోరింది ఆర్‌బీఐ. ఒకవేళ మీరు మీ కార్డుల్ని భవిష్యత్తులో ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ సేవల కోసం ఉపయోగించాలనుకుంటే మార్చి 16 లోపు కనీసం ఒక్కసారైనా ఈ లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ మాత్రమే కాదు, క్రెడిట్ కార్డులకూ ఈ నియమం వర్తిస్తుంది.

క్రెడిట్, డెబిట్ కార్డుల సెక్యూరిటీ పెంచడం కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు... అవసరం లేనప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ సర్వీసుల్ని స్విచాఫ్ చేసి, అవసరం ఉన్నప్పుడు స్విచాన్ చేసే సదుపాయాలను కస్టమర్లకు కల్పించాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ. అంటే మీరు ఓ రెండు నెలల పాటు ఆన్‌లైన్‌లో మీ కార్డును ఉపయోగించరనుకుంటే మీరు కార్డును ఆఫ్ చేయొచ్చు. దీని వల్ల ఒకవేళ మీ కార్డు ఎక్కడైనా పోయినా ఎవరూ ఆన్‌లైన్‌లో ఉపయోగించలేరు. కార్డు మోసాలను అడ్డుకోవడానికి ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులూ ఈ సదుపాయాన్ని తప్పనిసరిగా అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. మరి మీరు కొంతకాలం వాడని కార్డును ఎలా స్విచ్ఛాఫ్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

PAN card rule: మీ పాన్ నెంబర్‌ ఆఫీసులో ఇవ్వకపోతే జీతం కట్

Home Loan: ఇంటి కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

IRCTC Golden Chariot: గుడ్ న్యూస్... లగ్జరీ రైలు ప్యాకేజీ ధర తగ్గించిన ఐఆర్‌సీటీసీ
First published: March 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading