Home /News /business /

BANKS TO REMAIN CLOSED FOR 14 DAYS IN JULY UMG GH

Bank Holidays: జులైలో 14 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏయే తేదీల్లో క్లోజ్ అవుతాయంటే..?

జులైలో బ్యాంక్ హాలిడేస్ ఇవే.

జులైలో బ్యాంక్ హాలిడేస్ ఇవే.

బ్యాంక్ (Bank) ఉద్యోగులకు జులై నెల శుభవార్తను తీసుకురానుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 2022 జులై (July)లో ఉద్యోగులకు భారీగా సెలవులు (Holidays)ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 14 సెలవులు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
బ్యాంక్ ఉద్యోగులకు జులై (July) నెల శుభవార్తను తీసుకురానుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు (Banks) 2022 జులైలో ఉద్యోగులకు భారీగా సెలవులు (Holidays) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 14 సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన క్యాలెండర్ ప్రకారం కొత్త బ్యాంక్ సెలవులు అమల్లోకి వస్తాయి. సెలవులకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ క్యాలెండర్ వెల్లడిస్తుంది.

అయితే అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయత ఆధారంగా ఉంటాయి. మొత్తం సెలవులు రాష్ట్రాలను, బ్యాంకులను బట్టి భిన్నంగా ఉండవచ్చు. మొత్తానికి జులైలో 14 బ్యాంకు సెలవులు ఉన్నాయి. వాటిలో ఏడు వీకెండ్ లీవ్స్, ఎనిమిది ప్రాంతీయ సెలవులు (Regional holidays) ఉన్నాయి. నిర్దిష్ట ప్రాంతాల్లో రుణదాతలు వివిధ కారణాలతో సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీలు కలిపితే బ్యాంకులకు 15 సెలవులు వస్తాయి. అయితే కొచ్చి, తిరువనంతపురంలో బక్రీద్‌కు జులై 9న సెలవు వస్తుంది. ఆరోజు రెండో శనివారం కాబట్టి సాధారణంగా అన్ని బ్యాంకులకు మూతబడి ఉంటాయి. అంటే ఈ మేరకు ఒక రీజినల్ హాలిడే వీకెండ్ హాలిడే కలిసి, మొత్తం సెలవుల సంఖ్య 14కు పరిమితం అవుతుంది.

జులైలో సెలవుల జాబితా

జులై 1: కాంగ్ (రథయాత్ర)- భువనేశ్వర్

జులై 7: ఖర్చి పూజ- అగర్తల

జులై 9: బక్రీద్- కొచ్చి, తిరువనంతపురం; ఈ నెలలో రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు కూడా మూతపడనున్నాయి.

జులై 11: ఈద్-ఉల్-అజా - శ్రీనగర్, జమ్మూ

జులై 13: భాను జయంతి- గ్యాంగ్‌టక్

జులై 14: బెహ్ డియెంఖ్లామ్- షిల్లాంగ్

జులై 16: హరేలా - డెహ్రాడూన్

జులై 26: కేర్ పూజ - అగర్తల

ఇవి కాకుండా, బక్రీద్‌తో క్లాష్ సహా ఏడు వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి. ఈరోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

వారాంతపు సెలవుల జాబితా

జులై 3: మొదటి ఆదివారం

జులై 9: రెండవ శనివారం + బక్రీద్

జులై 10: రెండవ ఆదివారం

జులై 17: మూడవ ఆదివారం

జులై 23: నాలుగో శనివారం

జులై 24: నాలుగో ఆదివారం

జులై 31: ఐదో ఆదివారం

అందువల్ల మీకు ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే, మీ ప్రాంతం ప్రకారం ఈ సంవత్సరం జులైలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. వ్యాపారులతో పాటు సామాన్యులు కూడా ఈ సెలవుల జాబితాను అనుసరించడం మంచిది. జూలై 1 నుంచి అన్ని బ్యాంకుల రూల్స్ కూడా మారునుండటంతో ప్రజలు వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. క్రెడిట్, డెబిట్ కార్డ్ రూల్స్ కూడా జూలై 1 నుంచి మారనున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి కార్డ్ డీటైల్స్ ఎంటర్ చేయడం తప్పనిసరి అయింది.
Published by:Mahesh
First published:

Tags: Bank Holidays, Banks, Rbi, Sbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు