UPI | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ (RBI) ఇప్పటికే యూపీఐ లైట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలను ప్రస్తుతం కొన్ని బ్యాంకులు (Banks) మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ సేవల వల్ల కస్టమర్లు పిన్ లేకుండానే సూపర్ ఫాస్ట్‌గా ట్రాన్సాక్షన్లను పూర్తి చేయొచ్చు. ఏ ఏ బ్యాంకుల కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాం, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి తన కస్టమర్లకు యూపీఐ లైట్ సేవలు అందుబాటులో ఉంచాయి.
కస్టమర్లకు భారీ షాక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన!
పేటీఎం మిగతా బ్యాంకుల కన్నా యూపీఐ లైట్ సేవల్లో అగ్రస్థానంలో నిలిచింది. పేటీఎం యూపీఐ లైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆన్ డిజైస్ వాలెట్. మీ బ్యాంక్ అకౌంట్ నేరుగా ఈ యూపీఐ లైట్‌తో అనుసంధానమై ఉంటుంది. మీరు క్షణాల్లో పేమెంట్లు చేయొచ్చు. ఫెయిల్యూర్ రేటు చాలా చాలా తక్కువ. పీక్ అవర్స్‌లో కూడా పేమెంట్ క్షణాల్లో పూర్తి అవుతాయని చెప్పుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. రూ.2,500తో కోటి రూపాయల బెనిఫిట్!
ఒక యూపీఐ యాప్‌లో కేవలం ఒక్క యూపీఐ ఐడీని మాత్రమే యూపీఐ లైట్ సేవలను ఎనెబుల్ చేసుకోగలం. మీరు యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా రూ. 200 వరకే డబ్బులు పంపగలం. పేటీఎం యూపీఐ లైట్ వాలెట్‌కు రోజుకు రూ. 4 వేలు యాడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 వేల చొప్పున రెండు సార్లు ఇలా డబ్బులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా రూ. 2 వేలు యాప్ చేసుకున్న మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. తర్వాతనే మళ్లీ రూ. 2 వేలు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ముందు యాప్ చేసుకున్న రూ. 2 వేలు అలానే ఉంటే మీరు మళ్లీ రూ. 2 వేలు యాడ్ చేసుకోవడానికి వీలు ఉండదు. చిన్న చిన్ని లావాదేవీలకు మీరు యూపీఐ లైట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇలాంటి ట్రాన్సాక్షన్లకు 4 లేదా 6 డిజిటల్ పిన్ అవసరం ఉండదు. నేరుగా డబ్బులు చెల్లించొచ్చు. అంటే ట్రాన్సాక్సన్లు కూడా వేగంగా పూర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, BHIM UPI, UPI, Upi payments