Home /News /business /

BANKS STARTED HIKING THEIR MARGINAL COST OF FUND BASED LENDING RATES WHAT CAN BORROWERS DO TO COMBAT THE IMPACT OF HIGHER MCLR GH SRD

MCLR Rate: బ్యాంకులు MCLR పెంచితే లోన్ తీసుకున్నవారిపై ఎఫెక్ట్.. ఈ ప్రభావాన్ని ఇలా తగ్గించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MCLR Rate: ప్రస్తుతం లోన్స్ (Loans) మంజూరు చేసే బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు తమ కీలక రిఫరెన్స్ లెండింగ్ రేట్ల (Lending Rates)ను లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పెంచడం స్టార్ట్ చేశాయి.

ప్రస్తుతం లోన్స్ (Loans) మంజూరు చేసే బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు తమ కీలక రిఫరెన్స్ లెండింగ్ రేట్ల (Lending Rates)ను లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పెంచడం స్టార్ట్ చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పటికే ఎంసీఎల్ఆర్‌ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు కూడా ఇటీవల తమ ఎంసీఎల్ఆర్‌లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి? రెపో రేటు పెంపు బ్యాంకుల ఎంసీఎల్ఆర్‌ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీనివల్ల లోన్ తీసుకునేవారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి?
ఎంసీఎల్ఆర్ (MCLR) అనేది బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించే ఒక ఇంటర్నల్ రిఫరెన్స్ రేట్ (Internal Reference Rate). ఇది వివిధ రకాల రుణాలపై కనీస వడ్డీ రేటును నిర్ణయించడంలో బ్యాంకులకు సహాయపడుతుంది. ఈ ఇంటర్నల్ రిఫరెన్స్ రేట్ ఆధారంగానే బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ రేట్లను సవరిస్తాయి.

లోన్ ఫైనల్ రేటులో రిస్క్ ప్రీమియం, బ్యాంకులు వసూలు చేసే స్ప్రెడ్ కూడా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే... ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలపై అందించగల కనీస వడ్డీ రేటు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేట్ కంటే తక్కువ వడ్డీ రేటుకు కస్టమర్లకు రుణాలను ఆఫర్ చేయలేవు. అయితే రెపో రేటు అనేది బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు.

రెపో రేటు పెంపు బ్యాంకుల ఎంసీఎల్ఆర్‌ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఎంసీఎల్ఆర్ విధానంలో బ్యాంకులు సాధారణంగా రెపో రేటు మారిన వెంటనే తమ వడ్డీ రేట్లను అడ్జస్ట్ చేస్తాయి. ఈ రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూ ఉండటంతో ఆర్‌బీఐ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 4 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు (bps) పెంచుతుందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

జూన్ పాలసీ ప్రారంభంలోనే ఈ పెంపు ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఒక బీపీఎస్ అంటే పర్సంటేజ్ పాయింట్‌లో నూరవ వంతు. రెపో రేటు భారీగా పెరుగుతుందన్న అంచనాల నడుమ బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్‌లను పెంచుతున్నాయి. అయితే, ఈ పెంపు కేవలం ఫ్లోటింగ్ రేటు రుణాలపై మాత్రమే వర్తిస్తుంది కానీ స్థిర వడ్డీ రేటు రుణాలపై కాదు.

రెపో రేటును పెంచినట్లయితే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-లింక్డ్ లెండింగ్ రేటు (EBLR) కూడా పెరుగుతుందా?
ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-లింక్డ్ లెండింగ్ రేట్ (EBLR) అనేది ఎంసీఎల్ఆర్ పాలనకు సమాంతరంగా ఉండే వ్యవస్థ. దీనిలో బ్యాంకులు లోన్ రేటుపై రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు రేట్లు వంటి బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాయి. అందువల్ల, రెపో రేటును పెంచినట్లయితే, అది ఈబీఎల్ఆర్ (EBLR)లో కూడా పెరుగుదలకు దారితీయవచ్చు, తద్వారా రుణాల వడ్డీ రేట్లు కాస్ట్లీ గా మారవచ్చు.

ఎంసీఎల్ఆర్ లేదా ఈబీఎల్ఆర్ పెంచినట్లయితే, అది రుణగ్రహీతలపై ఎలా ప్రభావం చూపుతుంది?
బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ని పెంచినప్పుడు, కొత్త రుణగ్రహీతలు తమ ఆటో, హోం, వెహికల్, పర్సనల్ లోన్స్ తీర్చడానికి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. తత్ఫలితంగా రాబోయే నెలల్లో వారి ఈఎంఐలు పెరుగుతాయి.

అధిక ఎంసీఎల్ఆర్ ప్రభావాన్ని తగ్గించడానికి రుణగ్రహీతలు ఏం చేయాలి?
రుణగ్రహీతలు ఈఎంఐని తగ్గించడానికి రుణ కాలవ్యవధిని పెంచవచ్చు లేదా ఈఎంఐని తగ్గించడానికి ప్రీ-పేమెంట్ చేస్తే సరిపోతుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Bank loans, Banks, EMI, Mclr, Personal Loan, Repo rate

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు