మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ప్రతీ నెల క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈసారి బిల్లు చెల్లించకుండా మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నారా? అయితే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిపోయే అవకాశముంది. మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లకు కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించేస్తున్నాయన్న కంప్లైంట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. కొందరి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏకంగా 80% తగ్గిపోయిందన్నది ఆ కంప్లైంట్ సారాంశం. అంటే అంతకుముందు రూ.2,00,000 లిమిట్ ఉంటే అది కాస్తా రూ.40,000 వరకు తగ్గిపోయింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నవారికి క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిపోతుంది.
క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకున్నవారికి మాత్రమే కాదు... పర్సనల్ లోన్ ఈఎంఐలు వాయిదా వేసుకున్నవారి క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గింది. అంటే పర్సనల్ లోన్‌పై మారటోరియం ఎంచుకుంటే వారికి ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గిపోయింది. అంతేకాదు లిమిట్ ఎక్కువగా ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తక్కువగా వాడుతున్నా వారి లిమిట్ కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకే ఆర్బీఐ మారటోరియం ఆప్షన్‌ను ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మారటోరియం ఎంచుకుంటున్నారు. అయితే ఈఎంఐలు చెల్లించలేకపోతున్నవారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తున్న బ్యాంకులు వారి క్రెడిట్ లిమిట్ తగ్గిస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కస్టమర్ల క్రెడిట్ రికార్డ్ సమీక్షించి రిస్క్ తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలు చెల్లించే స్తోమత ఉంటే మారటోరియం ఆప్షన్ ఎంచుకోకపోవడమే మంచిది. మారటోరియం ఎంచుకోవడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. మారటోరియం ఎంచుకుంటే ఈఎంఐలు వాయిదా వేయొచ్చు. కానీ వడ్డీ మాత్రం చెల్లించాల్సిందే. కాబట్టి మీరు మారటోరియం ఎంచుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి
EMI Moratorium: హోమ్ లోన్ మారటోరియంతో రూ.2.34 లక్షల నష్టం... ఎందుకంటే
EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...
EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank loans, Banking, Corona, Corona virus, Coronavirus, Covid-19, Credit cards, Home loan, Housing Loans, Lockdown, Personal Finance, Personal Loan