హోమ్ /వార్తలు /బిజినెస్ /

Good News: ముగ్గురి పెద్దల మెడకు బిగుసుకున్న ఉచ్చు.. 9 వేల కోట్ల రికవరీ

Good News: ముగ్గురి పెద్దల మెడకు బిగుసుకున్న ఉచ్చు.. 9 వేల కోట్ల రికవరీ

వ్యాపారం పేరుతో కోట్లు కొల్లగొట్టారు.. జల్సాలు చేశారు.. ఎగ్గొట్టేందుకు విదేశాలకు పారిపోయారు.. కానీ ఈడీ మాత్రం ముక్కుపిండి వారి దగ్గర సొమ్ము వసూలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకులు 9 వేల కోట్లు రికవరీ చేసుకున్నాయి.

  వ్యాపారాల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ఘరానా పెద్దల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వ బ్యాంకులను మోసం చేసిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన 18,170 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు జప్తు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. అందులో వీరి నుంచి రావాల్సిన 22,586 కోట్ల బకాయిల్లో ఇవి 80 శాతానికి సమానమని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే 9,371 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ ముగ్గురు ఘరానా పెద్దలు ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్లో.. వీటి విలువ 40 శాతం ఉంటుందని తెలిపింది. మరోవైపు విజయ్‌ మాల్యాకు యునైటెడ్‌ బ్రూవరీస్‌, మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కంపెనీల్లో ఉన్న 5,800 కోట్ల విలువైన షేర్లను బెంగళూరులోని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ విక్రయించిందని ఈడీ పేర్కొంది. ఈ నెల 25న మరోసారి 800 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో మాల్యాకు చెందిన ఈ షేర్లను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది.

  వ్యాపారాల పేరుతో వీరు పీఎస్బీలను నుంచి సుమారు.22,586 కోట్లు రుణాలుగా తీసుకుని తరువాత పారిపోయారు. దేశ, విదేశాల్లో అనేక డొల్ల కంపెనీలు స్థాపించి నిధులను విదేశాలకు తరలించారు. ఆ వాస్తవాలను ఛేదించినట్టు ఈడీ ప్రకటించింది. విదేశాల్లో తలదాచుకున్న వీరిని దేశానికి రప్పించే ప్రయత్నాలూ త్వరలో ఒక కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. తనను భారత్‌కు అప్పగించవద్దని విజయ్‌ మాల్యా పెట్టుకున్న పిటిషన్‌ను బ్రిటన్‌ సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కాగా తనను భారత్‌కు అప్పగించరాదంటూ యూకే హైకోర్టులో నీరవ్‌ మోదీ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో వారు భారత్ కు రావడం ఖాయమంటున్నారు.

  ఇదీ చదవండి: జమ్మూ కశ్మీర్ నేతలతో నేడు మోదీ భేటీ.. ప్రత్యేక రాష్ట్ర హోదాపై ఉత్కంఠ

  పీఎస్‌బీ లను నిండా ముంచిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి ఘరానా మోసగాళ్లను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్‌ చేశారు. ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్న ఘరానా పెద్దలను వదలం. వారి ఆస్తులను జప్తు చేసి మరీ బకాయిలు వసూలు చేస్తామని ట్వీట్‌ చేశారు. భారత ప్రభుత్వం మాత్రం త్వరలోనే వీరిని వెనక్కు రప్పిస్తామని ధీమాగా చెబుతోంది. అయితే ప్రస్తుతం 9 వేల కోట్ల రికవరీ అన్నది కంటితుడుపు చర్య మాత్రమే అని.. ఈ పేరు చెప్పి మరికొన్ని రోజులు వారిని వదిలేస్తారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వారికి వెంటనే ఇండియాకి రప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

  First published:

  Tags: Mehul Choksi, Nirav Modi, Vijay Mallya

  ఉత్తమ కథలు